కాంగ్రెస్ అవినీతిపరులు, దొంగల పార్టీ | kishan reddy fires on congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ అవినీతిపరులు, దొంగల పార్టీ

Dec 4 2016 3:34 AM | Updated on Aug 21 2018 9:33 PM

కాంగ్రెస్ అవినీతిపరులు, దొంగల పార్టీ - Sakshi

కాంగ్రెస్ అవినీతిపరులు, దొంగల పార్టీ

కాంగ్రెస్ పార్టీ అవినీతిపరులు, దొంగల పార్టీ అని భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేత జి.కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు

భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేత జి.కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అవినీతిపరులు, దొంగల పార్టీ అని భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేత జి.కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీ అవినీతిపరులతో కూడుకున్నది కావడంతో మిగతా వారిని కూడా దొంగలుగానే ఆ నాయకులు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ నాయకులు చేసే తాటాకు చప్పుళ్లకు మోదీ భయపడరని, ఈ నిర్ణయంపై బీజేపీ ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రశ్నే తలెత్తదన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా కమిటీ హాల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై, పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై శనివారం హైదరాబాద్‌లో ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రధాని కావాలని కలలు గంటున్న కాంగ్రెస్ నాయకుడికి దేశం గురించి ఎలాంటి శ్రద్ధాసక్తులు లేవని పరోక్షంగా రాహుల్‌గాంధీని ఉద్దేశించి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బంగారంపై జరుగుతున్న ప్రచారాన్ని మహిళలు నమ్మవద్దని, మోదీ చర్యలతో 20 రోజుల్లోనే తులం బంగారం ధర రూ. 5 వేలు తగ్గిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement