ఉరి తీసినా పాపం లేదు | kill that oldman | Sakshi
Sakshi News home page

ఉరి తీసినా పాపం లేదు

Sep 19 2016 11:24 PM | Updated on Oct 2 2018 5:51 PM

ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడు లైంగికదాడికి యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వృద్ధుడికి దేహశుద్ధి చేశారు.

కుషాయిగూడ: ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడు లైంగికదాడికి యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వృద్ధుడికి దేహశుద్ధి చేశారు. కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం... ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూర గ్రామానికి చెందిన కృష్ణయ్య(65) భార్య రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. కృష్ణయ్య ఏడాది కాలంగా కుమారుడితో పాటు నగరానికి వచ్చి చక్రిపురంలో ఉంటూ వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. చర్లపల్లిలో ఉంటున్న కూతురు ఇంటికి ఆదివారం వెళ్లాడు. సాయంత్రం ఎవరు లేని సమయంలో పక్క పోర్ష¯ŒSలో ఉండే ఐదేళ్ల చిన్నారిని ఆడిస్తున్నట్టు నటించి లైంగిక దాడికి యత్నించాడు. ఇది గమనించిన బాలిక తల్లిదండ్రులు అతడిని చితకబాదడంతో తప్పించుకొని పారిపోయి చక్రిపురంలోని ఇంట్లో తలదాచుకున్నాడు. ఇదిలా ఉండగా... సోమవారం ఉదయం బాలికను తల్లిదండ్రులు స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. యాధృచ్ఛకంగా నిందితుడు కృష్ణయ్య కూడా అదే సమయంలో వైద్యం చేయించుకొనేందుకు అదే ఆసుపత్రికి వచ్చాడు. గమనించి చిన్నారి బంధువులు ఆవేశం ఆపుకోలేక మళ్లీ అతడిని చితకబాదారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కృష్ణయ్యను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అత్యాచార యత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇ¯ŒSస్పెక్టర్‌ ఎ¯ŒS.వెంకటరమణ తెలిపారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామన్నారు. కాగా, చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన కృష్ణయ్యను ఉరి తీయాలని రాష్ట్ర బాలల హక్కుల సంఘం ప్రతినిధులు అచ్యుతరావు, అనురాధారావు ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. పోక్సో చట్టం కింద బాధిత చిన్నారికి ఆర్థిక సహాయం అందించాలని వారు కలెక్టర్‌ను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement