
నటి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నటుడిపై కేసు
వర్ధమాన సినీ నటి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సహచర నటుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వర్ధమాన సినీ నటి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సహచర నటుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వెంకటగిరిలో నివసించే యువతి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, టీవీ సీరియళ్లలోనూ నటిస్తోంది. సినీ నటుడు అల్లా భక్ష్ కొంత కాలంగా ఆమెను వెంబడిస్తూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఆమె ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించడంతో బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.