మూసీలో పసికందు మృతదేహం | in Musée babe 's body | Sakshi
Sakshi News home page

మూసీలో పసికందు మృతదేహం

Aug 30 2016 12:26 AM | Updated on Sep 4 2017 11:26 AM

రెండు రోజుల పసికందు మృతదేహం మూసీలో లభ్యమైంది.

చాదర్‌ఘాట్‌: రెండు రోజుల పసికందు మృతదేహం మూసీలో లభ్యమైంది. చాదర్‌ఘాట్‌ ఎస్‌ఐ సాయికుమార్‌ కథనం ప్రకారం...వాహెద్‌నగర్‌ ప్రాంతంలోని మూసీకాలువలో సోమవారం మగశిశువు మృతదేహం పడి ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు వెలికి తీయించి పోస్టుమార్టం కోసం తరలించారు. శిశువు చనిపోతే ఎవరైనా కాలువలో పడేశారా? లేక బతికుండగానే కావాలని నీటిలోకి విసిరేశా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement