హోదా కావాలంటే మద్దతు ఉపసంహరించుకో | If you want the special status of withdraw support | Sakshi
Sakshi News home page

హోదా కావాలంటే మద్దతు ఉపసంహరించుకో

May 1 2016 5:49 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి టీడీపీ మద్దతు ఉపసంహరించుకోవాలని, ప్రధానమంత్రికి తూతూ మంత్రంగా లేఖ రాస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు.

 - చంద్రబాబుకు వీహెచ్ సలహా

హైదరాబాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి టీడీపీ మద్దతు ఉపసంహరించుకోవాలని, ప్రధానమంత్రికి తూతూ మంత్రంగా లేఖ రాస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకుంటే ప్రత్యేక హోదా దానంతటదే వస్తుందన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 

కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రతిపాదించిందని, అదే విధంగా తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం వెంకయ్యనాయుడు చాలా మాట్లాడారని, అతనిప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

 ట్విట్టర్‌లో కూతలు కూసే పవన్‌కల్యాణ్ కాంగ్రెస్‌పై అనవసర కామెంట్లు చేయడం మానుకుంటే అతనికే మంచిదన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడి రాజకీయంగా పలుచన కావొద్దని హితవు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement