జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం బెయిల్‌పై విడుదలవుతారన్న వార్తను తెలుసుకున్న అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచే చంచల్‌గూడ, నల్లగొండ చౌరస్తా, మోజంజాహి మార్కెట్, గాంధీభవన్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ చౌరస్తా, తాజ్‌దక్కన్, జీవీకే, నాగార్జున సర్కిల్, జూబ్లీ చెక్‌పోస్ట్, కళింగభవన్ చౌరస్తా, లోటస్‌పాండ్‌లలో జగన్‌మోహన్‌రెడ్డి రాకకోసం ఎదురుచూశారు. చంచల్‌గూడ, లోటస్‌పాండ్ పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర
జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం బెయిల్‌పై విడుదలవుతారన్న వార్తను తెలుసుకున్న అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచే చంచల్‌గూడ, నల్లగొండ చౌరస్తా, మోజంజాహి మార్కెట్, గాంధీభవన్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ చౌరస్తా, తాజ్‌దక్కన్, జీవీకే, నాగార్జున సర్కిల్, జూబ్లీ చెక్‌పోస్ట్, కళింగభవన్ చౌరస్తా, లోటస్‌పాండ్‌లలో జగన్‌మోహన్‌రెడ్డి రాకకోసం ఎదురుచూశారు. చంచల్‌గూడ, లోటస్‌పాండ్ పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినప్పటికీ వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. పోలీసులు పలుమార్లు లాఠీలు ఝుళిపించినా.. అభిమానుల ఈలలు, కేరింతలు, నినాదాలతో చంచల్‌గూడ -లోటస్‌పాండ్ రహదారి దద్దరిల్లిపోయింది. సాయంత్రం చంచల్‌గూడలో ఉత్సాహంగా మొదలైన జగన్‌మోహన్‌రెడ్డి యాత్ర ఆయన నివాసానికి చేరుకునే వరకు అదే జోష్‌తో కొనసాగింది. సుమారు ఆరున్నర గంటల పాటు 18 కి.మీ.లకు పైగా సాగిన ప్రయాణంలో అభిమానులు కాన్వాయ్ వెంట పరుగులు తీస్తూ వైఎస్ కుటుంబానికి జేజేలు పలికారు. చంచల్‌గూడ జైలు ఆవరణలో పోలీస్ కుటుంబ సభ్యులు మొదలుకుని భారీ ఎత్తున తరలివచ్చిన మైనారీటీలు జగన్‌తో కరచాలనానికి పోటీపడ్డారు.
నాంపల్లిలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, సిబ్బంది రోడ్డు పొడవునా నిలబడి జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. ప్రైవేటు వ్యాపారవాణిజ్య సంస్థలు, కొనుగోలుదారులు సైతం షాపుల ముందు నిలబడి జగన్‌మోహన్‌రెడ్డి అభివాదానికి, ప్రతివాదం చేస్తూ.. విజయం మనదేనంటూ సంజ్ఞలు చేశారు. మోజంజాహీ మార్కెట్‌లో జీహెచ్‌ఎంసీ కార్పోరేటర్ కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అభిమానులు స్వాగతం పలకగా, లక్డీకాపూల్ చౌరస్తాలో పార్టీ నాయకులు పి.విజయారెడ్డి ఆధ్వర్యంలో గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతిస్తూ జగన్‌మోహన్‌రెడ్డికి హారతి పట్టారు. వీరతిలకం దిద్ది ఆశీర్వదించారు. టపాసులు పేల్చి పూల వర్షం కురిపించారు. ఇదే కూడలిలో పలు బస్తీల మహిళలు పిల్లా పాపలతో ఉదయం పదకొండు గంటల నుంచే జగన్ రాక కోసం వేచిచూశారు. పంజగుట్ట నాగార్జున సర్కిల్‌లో రెండు ఫ్లై ఓవర్ల మీద నుంచి పూలవర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ వికలాంగుల విభాగం చైర్మన్ పంగా నర్సింహులు యాదవ్ తన మూడ చక్రల వాహనంపై జైలుకు వచ్చారు. ఆయన వాహనం పార్టీ ప్రచార రథాన్ని తలపించింది. గాంధీభవన్ వద్ద గోషామహల్ నియోజకవర్గం నాయకులు సయ్యద్ సాజిద్ అలీ, మెట్టు రాఘవేంద్ర, జితేంద్ర తివారీ, బ్రిజ్‌రాజ్‌సింగ్, దీపక్‌సింగ్, కపిల్‌లతో పాటు వందలాది మంది కార్యకర్తలు స్వాగతం పలికారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో పలువురు ఐటీ ఉద్యోగులు జగన్‌మోహన్‌రెడ్డి అభివాద దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లలో రికార్డు చేసుకున్నారు. ఇదే రోడ్డులోని హెరిటేజ్ (చంద్రబాబు సంస్థ) ఫ్రెష్ ఉద్యోగులు సైతం బయటకు వచ్చి జగన్‌మోహన్‌రెడ్డిని చూసి కేరింతలు కొడుతూ అభివాదం చేశారు. లోటస్‌పాండ్ ఆవరణలో అభిమానులు పేల్చిన బాణాసంచా వెలుగులతో ఆ ప్రాంతం దీపావళి శోభను సంతరించుకుంది.
వెన్నంటి కదిలిన నాయకగణం
జగన్‌మోహన్‌రెడ్డి విడుదల కోసం ఉదయం నుంచే చంచల్‌గూడకు చేరుకున్న నగర నాయకులు ఆయన ఇంటికి చేరే వరకు వెన్నంటి ఉన్నారు. సీఈసీ సభ్యులు కె.శివకుమార్, జనక్‌ప్రసాద్, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్, యువజన విభాగం కన్వీనర్ పుత్తా ప్రతాపరెడ్డి, నగరంలోని పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు బి.జనార్దన్‌రెడ్డి, జంపన ప్రతాప్, మతీన్ ముజదాది, వడ్డేపల్లి నర్సింగ్‌రావు, పి.విజయారెడ్డి, దేపా భాస్కర్‌రెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, కార్పొరేటర్లు కాలేరు వెంకటేశ్, గుడిమెట్ల సురేష్‌రెడ్డి, సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, వెంకట్రావు, లింగాల హరిగౌడ్, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, ముక్కా రూపానందరెడ్డి, పీవి అశోక్‌కుమార్, అమృతసాగర్, శేఖర్‌గౌడ్, రాచమల్ల సిద్ధేశ్వర్, మోహన్‌కుమార్, సూర్యనారాయణరెడ్డి, వెల్లాల రాంమోహన్, కొలను శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో పలువురు అభిమానులు, కార్యకర్తలు జగన్‌మోహన్‌రెడ్డికి ఆయా కూడళ్లలో స్వాగతం పలికారు. ఇంకా జగన్‌ను చూసేందుకు వచ్చిన వారిలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల, రంగారెడ్డిజిల్లా మహిళా అధ్యక్షురాలు అమృతాసాగర్, మైనార్టీ నాయకులు షేక్ హర్షద్, బొడ్డుసాయినాథ్‌రెడ్డి, పల్లపు రాము, నగర అధ్యక్షులు ఆదం విజయ్‌కుమార్ ఎడ్ల వాసుదేవరెడ్డి, ప్రధాన కార్యదర్శి మూల హరీష్‌గౌడ్, వంగా మధుసూదన్‌రెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు సిద్దాల సంకీర్త్ , సేవాదళ్ నాయకురాలు శ్రీలత, వైఎస్‌ఆర్‌సీపీ వికలాంగుల విభాగం చైర్మన్ పంగా నర్సింహులు యాదవ్, రాష్ట్ర మైనార్టీ నాయకుడు మసూమ్, క్రిసోలైట్, శ్రీలత, సూరజ్ ఎస్దానీ, సుమతీమోహన్, లలిత, మహతి తదితరులు ఉన్నారు.
ఆకట్టుకున్న జగన్ వేషధారులు
చంచల్‌గూడనుంచి లోటస్‌పాండ్‌దారిలో ఉదయం నుంచే జగన్‌మోహన్‌రెడ్డి కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ను జగన్ మాస్క్‌లు ధరించిన పలువురు ఆకట్టుకున్నారు. జగన్ కాన్వాయ్ వచ్చే గంట ముందు నుంచే జగన్‌మోహన్‌రెడ్డి మాస్క్‌లు మొహానికి తగిలించుకుని అభివా దం చేశారు. కొన్ని చోట్ల నిజమైన జగన్‌మోహన్‌రెడ్డి అని పొరబడి, ఆయనతో కరచలనానికి పలువురు పోటీ పడ్డారు.