మహిళా డీఎస్పీ ఫొటో తీసిన హోంగార్డు | home guard took photos of woman dcp | Sakshi
Sakshi News home page

మహిళా డీఎస్పీ ఫొటో తీసిన హోంగార్డు

May 3 2016 6:28 AM | Updated on Sep 3 2017 11:16 PM

మహిళా డీఎస్పీ ఫొటో తీసిన హోంగార్డు

మహిళా డీఎస్పీ ఫొటో తీసిన హోంగార్డు

క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పోలీసు డిపార్టుమెంట్‌లో ఒక ఆకతాయి తుంటరి చర్యలకు పాల్పడ్డాడు.

సర్వీస్ నుంచి హోంగార్డు తొలగింపు.. కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పోలీసు డిపార్టుమెంట్‌లో ఒక ఆకతాయి తుంటరి చర్యలకు పాల్పడ్డాడు. నేర విచారణ విభాగం (సీఐడీ) లో విధులు నిర్వహిస్తున్న మహిళా డీఎస్పీని ఓ హోంగార్డు తన సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీశాడు. వెంటనే పసిగట్టిన సదరు డీఎస్పీ.. హోంగార్డు సెల్‌ఫోన్ తీసుకుని పరిశీలించారు.

విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. హోంగార్డు తీసిన ఫొటోలను పరిశీలించి, అవి ఉద్దేశపూర్వకంగానే తీసినట్లు భావించారు. వెంటనే అతడిని సర్వీస్ నుంచి తొలగించడంతోపాటు.. సీఐడీలో ఐపీసీ 509, 354డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement