ఈ మట్టిలో ఏదో మ్యాజిక్ ఉంది.. | here is something magic in the soil . | Sakshi
Sakshi News home page

ఈ మట్టిలో ఏదో మ్యాజిక్ ఉంది..

Jan 30 2016 1:04 PM | Updated on Oct 8 2018 4:31 PM

ఈ మట్టిలో  ఏదో మ్యాజిక్ ఉంది.. - Sakshi

ఈ మట్టిలో ఏదో మ్యాజిక్ ఉంది..

‘తొలిసారి ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రానికి తేజగారు అడిగినప్పుడు హైదరాబాద్ గురించి ఏమీ తెలియదు.

‘తొలిసారి ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రానికి తేజగారు అడిగినప్పుడు హైదరాబాద్ గురించి ఏమీ తెలియదు. కన్ఫ్యూజన్, బెరుకు, భయంతో ఇక్కడికి వచ్చాను. నేను నార్త్ అమ్మాయినే అయినా ఇక్కడివారు నన్ను తెలుగమ్మాయి గానే భావించి చాలా ఆదరించారు. ఇక్కడివారి ప్రేమాభిమానాలు నన్నెంతో ప్రభావితం చేశాయి. నేను లంగా వోణి వేసుకోవడం నేర్చుకున్నది ఇక్కడే. సైకిల్ తొక్కడం కూడా ఇక్కడే నేర్చుకున్నా.

సౌత్ కల్చర్ మీద నాకు అవగాహన వచ్చింది కూడా ఇక్కడ  ఉన్నాకనే. ఇక బోనాల పండగప్పుడు సిటీ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అది చూడ్డం భలేగా ఉంటుంది. నాకు హైదరాబాద్ ఎంత నచ్చిందంటే రద్దీ రోడ్లు, మార్కెట్లు కూడా మురిపంగానే అనిపిస్తాయి. విదేశాలు వెళ్లి మళ్లీ హైదరాబాద్ వచ్చినప్పుడు సొంతూరుకు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఈ మట్టిలో మ్యాజిక్ ఉందనిపిస్తుంది.’ అని చెబుతోంది ప్రముఖ హీరోయిన్  - కాజల్ అగర్వాల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement