ఫుట్‌పాత్‌పై ప్రసవ వేదన | Footpath on the agony of childbirth | Sakshi
Sakshi News home page

ఫుట్‌పాత్‌పై ప్రసవ వేదన

Mar 5 2017 12:18 AM | Updated on Sep 5 2017 5:12 AM

ఫుట్‌పాత్‌పై ప్రసవ వేదన

ఫుట్‌పాత్‌పై ప్రసవ వేదన

అర్ధరాత్రి వేళ బంధువుల ఇంటికి వెళ్లేందుకు వచ్చిన ఓ నిండుచూలాలికి పురిటి నొప్పులు వచ్చాయి.

అక్కడే ఆడ శిశువుకు జన్మనిచ్చిన మహిళ

హైదరాబాద్‌: అర్ధరాత్రి వేళ బంధువుల ఇంటికి వెళ్లేందుకు వచ్చిన ఓ నిండుచూలాలికి పురిటి నొప్పులు వచ్చాయి. స్థానికులు 108కి సమా చారమందించారు. అనంతరం ఆమె పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు సమీపంలో నివాసం ఉండే జ్యోతి(24) నల్లకుంటలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం రాత్రి బయలుదేరింది. రాత్రి 11.10కి నల్లకుంట చేరుకోగానే.. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి.

దీంతో చౌరస్తా సమీపంలోని ఓ స్వీట్‌ షాప్‌ వద్ద ఫుట్‌పాత్‌పై కూలబడిపోయింది. నొప్పులతో ఇబ్బందిపడుతున్న ఆమెను చూసిన ఇద్దరు యువకులు పోలీసులు, 108కి సమాచారమందించారు. 108 సిబ్బంది, రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు మహిళల సహకారంతో జ్యోతి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement