తమ్ముడు, మరదలిని ఇంటిపై నుంచి తోసేసిన అక్క

తమ్ముడు, మరదలిని ఇంటిపై నుంచి తోసేసిన అక్క


► భార్య మృతి, భర్త పరిస్థితి విషమంహైదరాబాద్: ఆస్తి కోసం అక్కాతమ్ముళ్ల మధ్య నెలకొన్న వివాదం ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఐడీహెచ్ కాలనీలోని ఓ డబుల్ బెడ్‌రూం ఇంటిలో భార్యభర్తలైన చందు, జయశ్రీలు నివసిస్తున్నారు. వీరికి మాధురి, సుదీప్ పిల్లలు. ఉమ్మడి ఆస్తి అయిన డబుల్ బెడ్‌రూం ఇంటి కోసం చందు, తన సోదరి మీరాబాయిల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నారుు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మీరాబాయి తన కుటుంబసభ్యులతో కలసి చందు ఇంటికి వచ్చింది. మరోమారు ఇరువురి మధ్య రేగిన వివాదం తారాస్థారుుకి చేరుకుంది.దీంతో ఆవేశం పట్టలేని మీరాబారుు, కుమారుడు చింటు, కుమార్తె కీర్తి, అల్లుడు బబ్లూ కలసి చందు, జయశ్రీలను బలవంతంగా రెండో అంతస్తు నుంచి కిందికి తోసేశారు. పెద్దశబ్దం వినిపించడంతో కాలనీవాసులు వెళ్లి చూడగా తీవ్రగాయాలతో చందు, జయశ్రీ కిందపడి ఉన్నారు. గాయపడిన వారిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జయశ్రీ మృతిచెందగా, చందు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top