నకిలీ విత్తనాలు ప్రమాదకరం | fake seeds Dangerous Mallu Bhatti Vikramarka | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు ప్రమాదకరం

Oct 18 2016 3:12 AM | Updated on Oct 8 2018 9:21 PM

నకిలీ విత్తనాలు ప్రమాదకరం - Sakshi

నకిలీ విత్తనాలు ప్రమాదకరం

నకిలీ నోట్ల కంటే.. నకిలీ విత్తనాలు అత్యంత ప్రమాదకరమైనవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క
సాక్షి, ఖమ్మం: నకిలీ నోట్ల కంటే.. నకిలీ విత్తనాలు అత్యంత ప్రమాదకరమైనవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో నకిలీ విత్తనాల వల్ల రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందని అన్నారు. రైతులకు జరిగిన అన్యాయంపై రైతులు, రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. అనేకమంది రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోయారని, దీనికి కారణం ప్రభుత్వమేనన్నారు.  విత్తన సంస్థలకు లెసైన్ ్సలు ఇచ్చి అమ్ముకోవడానికి తోడ్పడటంలో మం త్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాత్ర కూడా ఉందని ఆరోపణలు వస్తున్నాయన్నారు.

ఎక్కడ ఏం జరిగిందో చెప్పకుండా అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్యను పదవి నుంచి తప్పించారని, కానీ, నకిలీ విత్తనాలు అమ్ముకోవడానికి అనుమతించిన పోచారంపై ఎం దుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.  ఆయన వ్యవహారం లో ప్రభుత్వానికి భాగం ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. గతంలో  స్టేషనరీ కుంభకోణంలో పాత్ర ఉందని పోచారం నుంచి మంత్రి పదవి నుంచి తొల గించారని, అలాంటి చరిత్ర కలిగిన మంత్రిని బర్తరఫ్ చేయాలని సీఎంను విక్రమార్క డిమాండ్  చేశారు. చర్యలు తీసుకోని పక్షం లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. గుత్తా ఆరోపణలపై మాట్లాడుతూ ఆయన దీపపు పురుగు లాంటి వారని, దానికితోడు ఊసరవెల్లిలా మారుతార న్నారు. ఊసరవెల్లి రంగులు మాత్రమే మారుస్తుందని, ఆయన కూతలు కూడా మారుస్తారని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement