దయచేసి తనను ఎన్‌కౌంటర్ చేయొద్దని నకిలీ నోట్ల తయారీ ముఠా నాయకుడు ఎల్లంగౌడ్ పోలీసులను వేడుకుంటున్నట్లుగా ఉన్న సీడీలు కలకలం రేపాయి.
సాక్షి, హైదరాబాద్: దయచేసి తనను ఎన్‌కౌంటర్ చేయొద్దని నకిలీ నోట్ల తయారీ ముఠా నాయకుడు ఎల్లంగౌడ్ పోలీసులను వేడుకుంటున్నట్లుగా ఉన్న సీడీలు కలకలం రేపాయి. ఈ సీడీలు గురువారం పలు మీడియా సంస్థల కార్యాలయాలకు చేరాయి. అందులో తనను ఎన్‌కౌంటర్ చేయొద్దని, పోలీసుల ముందు లొంగిపోతున్నానని ఉంది.
ఎల్లంగౌడ్ మంగళవారం సైబరాబాద్ పోలీసుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఈ సీడీలను రూపొందించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అలాగే, సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్‌వోటీ) పోలీసులు మెదక్ జిల్లా సిద్దిపేటలోని ఎల్లంగౌడ్ ఇంట్లో గురువారం సోదాలు నిర్వహించారు. స్కానర్‌తోపాటు ఇతర వస్తువులు, నకిలీ నోట్లు లభించినట్లు తెలిసింది.