ఆస్తి పన్ను చెల్లించడం లేదని ప్రజలను పలు విధాలుగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ వేధిస్తున్నారని రాష్ట్ర వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ సాజిద్ అలీ పేర్కొన్నారు.
హైదరాబాద్ సిటీ(అబిడ్స్): ఆస్తి పన్ను చెల్లించడం లేదని ప్రజలను పలు విధాలుగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ వేధిస్తున్నారని రాష్ట్ర వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ సాజిద్ అలీ పేర్కొన్నారు. మూడు, నాలుగు సంవత్సరాలుగా ఆస్తి పన్ను చెల్లించడంలేదని వ్యాపారులను, స్థానిక ప్రజలను జీహెచ్‌ఎంసీ అధికారులు వేదించడం తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మంగల్‌హట్‌లోని తన కార్యాలయంలో సాజిద్‌అలీ విలేకరులతో మాట్లాడుతూ... నాలుగేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించనప్పడు అలాంటి వారిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆయన ప్రశ్నించారు. నాలుగేళ్లుగా గ్రేటర్‌లో జీహెచ్‌ఎంసీ పనిచేయదంలేదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా జీహెచ్‌ఎంసీ నిద్రపోయి ఈ రోజు కళ్లు తెరిస్తే ప్రజలు జీహెచ్‌ఎంసీపై తిరుగుబాటు చేస్తారని పేర్కొన్నారు. ఇలా ప్రజలను వేధిస్తే తాము ట్యాంక్‌బండ్‌లోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరిచారు.