నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు... | cpm leaders protests in telangana over land acquisition bill | Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు...

Dec 29 2016 2:01 AM | Updated on Aug 13 2018 8:12 PM

భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గురువారం నిరసనలు చేపడుతున్నట్లు సీపీఎం నేతలు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గురు వారం నిరసనలు చేపడుతున్నట్లు రైతుసంఘం(సీపీఎం) నాయకులు జంగారెడ్డి, బొంతల చంద్రారెడ్డి తెలిపారు. రైతులు, నిర్వాసితులకు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు వ్యతిరేకించాలని కోరారు.

కేంద్ర చట్టం అమల్లో ఉన్నా ఆ చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా, బల వంతంగా భూములను సేకరించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావడం అన్యాయ మన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తోందని వ్యవసాయ కార్మికసంఘం(సీపీఎం) నాయకులు బి.ప్రసాద్, ఆర్‌.వెంకట్రాములు విమర్శించారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వ్యవసాయ కార్మికులు, సేవకులుగా ఉన్న వృత్తిదారులు, బడుగు, బలహీనవర్గాల కౌలు రైతులను సీఎం కేసీఆర్‌ మరోసారి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement