రోహిత్‌ కులం మార్చే ప్రయత్నాలు ఆపండి | CPI Narayana comments on Central government | Sakshi
Sakshi News home page

రోహిత్‌ కులం మార్చే ప్రయత్నాలు ఆపండి

Feb 16 2017 3:43 AM | Updated on Jul 26 2019 5:38 PM

రోహిత్‌ కులం మార్చే ప్రయత్నాలు ఆపండి - Sakshi

రోహిత్‌ కులం మార్చే ప్రయత్నాలు ఆపండి

రోహిత్‌ వేముల కులాన్ని మార్చాలని చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ డిమాండ్‌ చేశారు.

సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ

సాక్షి, హైదరాబాద్‌: రోహిత్‌ వేముల కులాన్ని మార్చాలని చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ డిమాండ్‌ చేశారు. దీనిపై ఉన్నత న్యాయ స్థానంతో విచా రణ జరిపించాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రోహిత్‌ దళితుడని గతంలో ఇచ్చిన సర్టిఫికెట్‌ను ఆమోదిస్తే కేంద్ర మంత్రులు స్మృతిఇరానీ, బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావులపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకా రం కేసు నమోదు చేయాల్సి వస్తుందన్నారు.

ఇదే జరిగితే వారు జైలుకు పోవడం, కేంద్రం సంక్షోభంలో పడటం ఖాయమని.. దాని నుంచి బయటపడేందుకే  నీచమైన డ్రామాకు దిగారన్నారు. కాగా, రోహిత్‌ దళితుడు కాదంటూ ఏపీ ప్రభుత్వం నిర్ధారించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు దళిత, గిరిజన, ప్రజా సంఘాలు ప్రకటించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement