హైదరాబాద్ నగరం పాతబస్తీ కిషన్బాగ్లో దారుణం. తనను ప్రేమించాలని ఓ బావ మరదలపై ఒత్తిడి తెచ్చాడు.
హైదరాబాద్ నగరం పాతబస్తీ కిషన్బాగ్లో దారుణం. తనను ప్రేమించాలని ఓ బావ మరదలపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దాంతో మరదలిపై కక్ష పెంచుకున్నాడు. శనివారం మరదలు ఇంటికి వచ్చిన అతడు ఆమెతో మాట్లాడుతూ కత్తితో అకస్మాత్తుగా దాడి చేశాడు. దాంతో ఆమె రక్తపు మడుగులోపడిపోయింది.
అంతలో తనతో తెచ్చుకున్న పెట్రోల్ను తన ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. మరదలి ఇంట్లోని కుటుంబ సభ్యులు వెంటనే తేరుకుని వారిద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.