భరత్‌ మృతి కేసులో మరిన్ని విషయాలు | cops probe on ravi teja brother bharat death case | Sakshi
Sakshi News home page

భరత్‌ మృతి కేసులో మరిన్ని విషయాలు

Jun 26 2017 3:38 PM | Updated on Aug 14 2018 3:22 PM

భరత్‌ మృతి కేసులో మరిన్ని విషయాలు - Sakshi

భరత్‌ మృతి కేసులో మరిన్ని విషయాలు

హీరో రవితేజ తమ్ముడు భరత్‌ మృతి కేసులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్‌: హీరో రవితేజ తమ్ముడు భరత్‌ మృతి కేసులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన మద్యం సేవించి కారు నడిపినట్టు వెల్లడైంది. ప్రమాదానికి ముందు ఆయన నోవాటెల్‌ హోటల్‌లో గడిపిన దృశ్యాలు సీసీ కెమెరా రికార్డయ్యాయి. శనివారం ఆయన నోవాటెల్‌లో స్నేహితుడి పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు. సాయంత్రం 4 గంటలకు స్విమ్మింగ్‌పూల్‌ వద్ద ఆయన మద్యం సేవించినట్టు సీసీ కెమెరా దృశ్యాల్లో కనిపించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9.25 గంటల వరకు ఆయన నోవాటెల్‌లో ఉన్నారు.

తర్వాత అక్కడి నుంచి తన కారులో వెళ్లిపోయారు. రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కొత్వాల్‌గూడ వద్ద ఆగివున్న లారీని ఆయన కారు ఢీకొంది. సంఘటనా స్థలంలోనే భరత్‌ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో ఆయన కారు 145 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అతివేగం, మద్యంమత్తు ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement