నా కారును దౌర్జన్యంగా తీసుకెళ్లాడు | Construction took my car | Sakshi
Sakshi News home page

నా కారును దౌర్జన్యంగా తీసుకెళ్లాడు

May 15 2017 10:05 AM | Updated on Aug 14 2018 3:14 PM

నా కారును దౌర్జన్యంగా తీసుకెళ్లాడు - Sakshi

నా కారును దౌర్జన్యంగా తీసుకెళ్లాడు

ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్‌ కారు డ్రైవర్‌ తన కారును దౌర్జన్యంగా తీసుకువెళ్లడమే కాక దెబ్బతిన్న కారుకు డబ్బులు

అల్లు అర్జున్‌ కారు డ్రైవర్‌పై ఫిర్యాదు
బంజారాహిల్స్‌: ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్‌ కారు డ్రైవర్‌ తన కారును దౌర్జన్యంగా తీసుకువెళ్లడమే కాక, దెబ్బతిన్న కారుకు డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నాడని ఓ క్యాబ్‌ డ్రైవర్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. సినీ హీరో అల్లు అర్జున్‌ తన కుటుంబంతో కలిసి శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.1లో ఉన్న మోకా బాక్‌కు వెళ్లాడు. ఆయన బెంజ్‌ కారు (ఏపీ 09 పీవీ 0666)ను డ్రైవర్‌ మహిపాల్‌ రోడ్డు పక్కన పార్క్‌చేసి కూర్చున్నాడు.

అదే సమయంలో క్యాబ్‌ డ్రైవర్‌ రామకృష్ణ తన కారు(టీఎస్‌ 07 యూబీ 0630)ను రివర్స్‌ చేస్తూ అల్లు అర్జున్‌ బెంజ్‌ను ఢీ కొట్టాడు. దీంతో అర్జున్‌ డ్రైవర్‌ మహిపాల్‌కు కొంత డబ్బును చెల్లించి కారును తీసుకెళ్లాడు రామకృష్ణ. మరుసటి రోజు ఉదయం రామకృష్ణ ఇంటికి వెళ్లిన అర్జున్‌ డ్రైవర్‌ మహిపాల్‌ కారు రిపేరుకు ఇచ్చిన డబ్బు సరిపోదని రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. 

షో రూంకు కారును తీసుకెళ్తే రూ.2 లక్షలు అవుతుందని బెదిరించాడు. దీంతో రెక్కాడితే కాని డొక్కాడని స్థితిలో ఉన్న క్యాబ్‌ డ్రైవర్‌ అంత డబ్బు ఇచ్చుకోలేనని చెప్పాడు. దీంతో మహిపాల్‌ రామకృష్ణ క్యాబ్‌ను తీసుకెళ్లిపోయాడు. ఉన్న ఒక్క ఆదరవును మహిపాల్‌ తీసుకుపోవడంతో ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు రామకృష్ణ . ఇద్దరు డ్రైవర్లను పిలిపించిన పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement