యువతిని వేధిస్తున్న ఓ కానిస్టేబుల్ కటకటాలపాలయ్యాడు.
హైదరాబాద్: యువతిని వేధిస్తున్న ఓ కానిస్టేబుల్ కటకటాలపాలయ్యాడు. వివరాలివీ..అమీర్‌పేట్ గురుద్వారా ప్రాంతంలో నివాసం ఉండే ఓ యువతిని 13వ బెటాలియన్‌లో పనిచేసే కానిస్టేబుల్ శ్రీనివాస్ గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు.
దీనిపై బాధితురాలు ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు.