సొంత నివాసానికి సీఎం కేసీఆర్ | cm kcr arriaval to own house | Sakshi
Sakshi News home page

సొంత నివాసానికి సీఎం కేసీఆర్

Jan 21 2016 9:33 PM | Updated on Aug 14 2018 10:54 AM

సొంత నివాసానికి సీఎం కేసీఆర్ - Sakshi

సొంత నివాసానికి సీఎం కేసీఆర్

హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముచ్చటించారు.

క్యాన్సర్ రోగులతో మాటామంతి

హైదరాబాద్: హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముచ్చటించారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న తన సొంత నివాస భవనానికి వెళ్లారు. అదే సమయంలో పక్కనే ఉన్న బసవతారకం ఆసుపత్రిలో ఉన్న క్యాన్సర్ రోగులు, వారి సహాయకులతో మాట్లాడారు.

ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకోవటంతో పాటు రోగుల సహాయకులకు వసతి సదుపాయాలు, నైట్ షెల్టర్ల ఏర్పాటు అవసరాలను ఆరా తీశారు.  ఇటీవల సినీ నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎం కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే. సిటీలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులన్నింటా రోగుల సహాయకులు ఉండేందుకు వీలుగా షెల్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించటం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement