చంద్రబాబుతో భేటీ కానున్న జస్టిస్ మంజునాథ | chandrababu will meet with justice manjunath | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో భేటీ కానున్న జస్టిస్ మంజునాథ

Feb 2 2016 10:28 PM | Updated on Jul 28 2018 3:23 PM

చంద్రబాబుతో భేటీ కానున్న జస్టిస్ మంజునాథ - Sakshi

చంద్రబాబుతో భేటీ కానున్న జస్టిస్ మంజునాథ

కాపు రిజర్వేషన్ల ప్రక్రియ కాలపరిమితిపై బుధవారం జరిగే కేబినెట్లో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు వెల్లడించారు.

హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల ప్రక్రియ కాలపరిమితిపై బుధవారం జరిగే కేబినెట్లో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో కళా వెంకట్రావు మాట్లాడుతూ... ఈ నెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడితో కాపు కమిషన్ ఛైర్మన్  జస్టిస్ మంజునాథ భేటీ అవుతారని తెలిపారు.

కమిషన్ నివేదిక అందజేయాలని జస్టిస్ మంజునాథను కోరతామని తెలిపారు. మంత్రులు చినరాజప్ప, నారాయణ, గంటాతోపాటు ఎమ్మెల్యేలు బొండా, తోట త్రిమూర్తులు, ఎంపీ అవంతి శ్రీనివాస్తోపాటు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కాపు రిజర్వేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తారని కళా వెంకట్రావు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement