నోట్ల రద్దు నష్టాలపై విస్తృత ప్రచారం చేయండి


- కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ సూచన  

నల్లకుబేరులకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటోంది

 

 సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దువల్ల సామా న్యులు పడుతున్న కష్టాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఈ విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు, నల్లధనం పోగేసిన నేతలకు కొమ్ము కాస్తున్న వైనాన్ని కూడా ఎండ గట్టాలని కోరారు. గురువారం సాయంత్రం గాంధీ భవన్‌లో శ్రీనివాసన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. టీపీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, కమిటీ సభ్యులు జి.నాగయ్య, మల్లు రవి తదిత రులు హాజరయ్యారు. ఈ సందర్బంగా శ్రీనివా సన్, భట్టి విక్రమార్క మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోరుుందని, కేంద్ర అనాలోచిత చర్యల వల్ల 120 కోట్ల ప్రజలు రోడ్లపైకొచ్చి తీవ్రంగా అల్లాడిపోతున్నారని దుయ్యబట్టారు.



అరుునప్ప టికీ నోట్ల రద్దు పెద్ద ఘన కార్యంగా బీజేపీ ప్రచారం చేసుకుంటోందని, దీనిని సమర్థవం తంగా తిప్పి కొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలపై ఉందన్నారు. నల్లధనం పోగేసుకున్న వారికి మోదీ ప్రభుత్వం అండగా ఉంటోందని, విజయ్ మాల్యాకు వేలాది కోట్ల రుణం మాఫీ చేయడమే ఇందుకు నిదర్శనమ న్నారు. ఆయా అంశాలతో పాటు రెండున్నరేళ్లలో కేంద్రం చేసిన తప్పిదాలపై వినూత్న రీతిలో ప్రచారం చేయాలని కోరారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో నినాదాలతో కూడిన పోస్టర్లు, కరపత్రాలను ముద్రించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top