బీడీ కార్మికుల పొట్టకొట్టే జీఓ నెం 727(e) ను రద్దు చేయాలంటూ ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో మహిళలు, బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: బీడీ కార్మికుల పొట్టకొట్టే జీఓ నెం 727(e) ను రద్దు చేయాలంటూ ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో మహిళలు, బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలోని జగద్గిరిగుట్టలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇటీవల బీడీ కట్టలపై ఉండే పుర్రె బొమ్మను 40 శాతం నుంచి 80 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని నిరసిస్తూ..వెంటనే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవరించాలని డిమాండ్ చేశారు.