వెయ్యి మంది బాబులు అడ్డొచ్చినా.... | balka suman takes on chandrababu | Sakshi
Sakshi News home page

వెయ్యి మంది బాబులు అడ్డొచ్చినా....

May 3 2016 5:10 PM | Updated on Jul 28 2018 3:33 PM

తెలంగాణ వ్యతిరేకతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు మరోసారి చాటుకున్నారని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మంగళవారం హైదరాబాద్లో ఆరోపించారు.

హైదరాబాద్ : తెలంగాణ వ్యతిరేకతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు మరోసారి చాటుకున్నారని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మంగళవారం హైదరాబాద్లో ఆరోపించారు. వెయ్యి మంది బాబులు అడ్డొచ్చినా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం ఆగదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ నోట్లో మట్టి కొట్టే పార్టీలో టీడీపీ నేతలు ఎలా కొనసాగుతారని బాల్క సుమన్ ప్రశ్నించారు.

ముందు చంద్రబాబుపై పోరాడాలని ఆ పార్టీ సీనియర్ నేత రేవంత్రెడ్డికి హితవు పలికారు. తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement