ఆరోగ్యమే..ఆనందం | actress regina visits cancer patients in apollo hospital | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమే..ఆనందం

Jun 5 2016 1:37 AM | Updated on Aug 20 2018 2:31 PM

ఆరోగ్యమే..ఆనందం - Sakshi

ఆరోగ్యమే..ఆనందం

అందాల తార రెజీనా శనివారం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి విచ్చేశారు. కేన్సర్ సర్వైవర్స్ డే సందర్భంగా ‘సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్’ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

అందాల తార రెజీనా శనివారం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి విచ్చేశారు. కేన్సర్ సర్వైవర్స్ డే సందర్భంగా ‘సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్’ పేరిట ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కేన్సర్ నుంచి  విముక్తి పొందిన పలువుర్ని అభినందించారు.

 సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్
కేన్సర్ సర్వైవర్స్ డేను పురస్కరించుకొని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ‘సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్’ పేరిట శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీ నటి రెజీనా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రాణాంతక కేన్సర్ నుంచి విముక్తి పొందిన వారిని అభినందించారు. వారి ధైర్యసాహసాలను కొనియాడారు. వారితో ఆమె అనుభవాలు పంచుకొని సరదాగా గడిపారు. కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆస్పత్రి డెరైక్టర్ విజయ్ ఆనంద్‌రెడ్డితో కలిసి ‘సింబల్ ఆఫ్ రెసిలెన్స్’ను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అపోలో జేఎండీ డాక్టర్ సంగీతారెడ్డి పాల్గొన్నారు.  బంజారాహిల్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement