ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు అయిన ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు అయిన ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. శంకుస్థాపన పేరుతో ప్రభుత్వం ఆర్భాటాలు చేసిందని ఆయన విమర్శించారు. అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ శంకుస్థాపనకు వందలకోట్లు ఖర్చు అవసరమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు
దసరా పండుగ సందర్భంగా రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ నుంచి వరాలు లభిస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది.