పాతబస్తీ మీదుగా దారి మళ్లిన బస్సులు | Traffic diversions in Hyderabad | Sakshi
Sakshi News home page

పాతబస్తీ మీదుగా దారి మళ్లిన బస్సులు

Dec 18 2015 6:21 PM | Updated on Sep 4 2018 5:07 PM

మలక్‌పేట, చాదర్‌ఘాట్ ప్రాంతాలలో మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్నందున కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ట్రాఫిక్ పోలీసులు పాతబస్తీ మీదుగా దారి మళ్లిస్తున్నారు.

చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): మలక్‌పేట, చాదర్‌ఘాట్ ప్రాంతాలలో మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్నందున కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ట్రాఫిక్ పోలీసులు పాతబస్తీ మీదుగా దారి మళ్లిస్తున్నారు. పికెట్, అచ్చంపేట, కల్వకుర్తి డిపోలకు చెందిన ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్ లగ్జరీ బస్సులు చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ నుంచి ఫలక్‌నుమా, ఇంజన్‌బౌలి, లాల్‌దర్వాజా మోడ్, శాలిబండ, ఖిల్వత్, సిటీ కాలేజీ మీదుగా ఎంజీబీఎస్ డిపోకు చేరుకుంటున్నాయి.

ఇటీవలే కందికల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కొన్ని బస్సులను చాంద్రాయణగుట్ట చౌరస్తా నుంచి కందికల్ ఆర్‌వోబీ మీదుగా ఛత్రినాక, లాల్‌దర్వాజా, లాల్‌దర్వాజా మోడ్ మీదుగా కూడా ఎంజీబీఎస్‌కు పంపిస్తున్నారు. కాగా శ్రీశైలం వెళ్లే బస్సులు మాత్రం చాదర్‌ఘాట్, మలక్‌పేట, సంతోష్‌ నగర్‌ల మీదుగానే వెళుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement