ప్రాణభయంతో ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్ ముందే ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కల్యాణదుర్గం: ప్రాణభయంతో ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్ ముందే ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండల కేంద్రంలోని పీఎస్ ఎదట జరిగింది. వివరాలు.. బ్రహ్మసముద్రం మండలం కపటలింగనపల్లి గ్రామానికి చెందిన జంగలి పరమేష్ అనే వ్యక్తి గ్రామంలోని మచ్చప్ప, కనియప్పలు నుంచి తనకి ప్రాణభయం ఉందని వారం క్రితం మండలంలోని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే, బ్రహ్మసముద్రం మండల పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో సోమవారం పరమేష్ కల్యాణదుర్గం పోలీస్‌స్టేషన్ ఎదట కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన పోలీసులు పరమేష్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.