ఉద్యోగ ఖాళీల భర్తీకి కృషి చేయండి | Make the effort to fill job vacancies | Sakshi
Sakshi News home page

ఉద్యోగ ఖాళీల భర్తీకి కృషి చేయండి

Aug 1 2015 1:53 AM | Updated on Aug 18 2018 8:54 PM

ఉద్యోగ ఖాళీల భర్తీకి కృషి చేయండి - Sakshi

ఉద్యోగ ఖాళీల భర్తీకి కృషి చేయండి

ఏపీలో ఉద్యోగ ఖాళీల భర్తీకి కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ నిరుద్యోగ విద్యార్థి కార్యాచరణ సమితి విజ్ఞప్తి చేసింది.

వైఎస్ జగన్‌కు ఏపీ నిరుద్యోగుల వినతి
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఉద్యోగ ఖాళీల భర్తీకి కృషి చేయాలని   వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ నిరుద్యోగ విద్యార్థి కార్యాచరణ సమితి విజ్ఞప్తి చేసింది. సమితి అధ్యక్షుడు రెడ్డి వరప్రసాద్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గం శుక్రవారం జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకుని వినతిపత్రం అందజేసింది. నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ ప్రకటన వెలువడలేదని, ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని నిరుద్యోగులు తెలిపారు. ఉద్యోగాల భర్తీ జరిగేలా చూడాలని.. ఈ మేరకు ప్రభుత్వానికి, ఏపీపీఎస్సీకి ప్రతిపక్షం తరఫున లేఖ రాయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement