రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన | double bedroom flats foundation in telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన

Oct 22 2015 2:30 PM | Updated on Sep 29 2018 4:44 PM

రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన - Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా గురువారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా గురువారం కార్యక్రమం జరిగింది. ఎన్నికల్లో  అత్యంత ప్రధానమైన హామీ అయినప్పటికీ అధికారంలోకి వచ్చి 17 నెలలు గడిచినా చేపట్టలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ పథకాన్ని విజయదశమి రోజున ప్రభుత్వం ఆరంభించింది. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నిమోజక వర్గాల్లో లాంఛనంగా ప్రారంభించింది. స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, ఎంపీలు , ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా శంకుస్థాపనలు జరిపారు.

నిజామాబాద్: జిల్లాలోని బోధన్ మండలం ఆటోనగర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల స్థలాలకు ఎంపీ కవిత భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షఖీల్, ఇతర నేతలు పాల్గొన్నారు.

మహబూబ్ నగర్: వీరన్న పేటలో ఇళ్ల స్థలాలకు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ శ్రీదేవి లు భూమి పూజ చేశారు.

నల్లగొండ: జిల్లాలోని చౌటుప్పల్ లో ఇళ్ల స్థలాలకు మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

కరీంనగర్: జిల్లాలోని సిరిసిల్ల నియోజక వర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ముక్తాబాద్, గంభీరావు పేటలో నిర్మించతలపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు భూమి పూజ నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement