'ఎంతటి వారైనా ఊరుకోం' | 256 people hospitalized in nizamabad district due to kullu | Sakshi
Sakshi News home page

'ఎంతటి వారైనా ఊరుకోం'

Sep 16 2015 12:25 PM | Updated on Sep 3 2017 9:31 AM

నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు భాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంపై మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు భాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంపై మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. బుధవారం జిల్లాలో పర్యటించిన ఆయన బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కల్తీ కల్లు తయారీని ఉపేక్షించేది లేదన్నారు. ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడితే ఎంతటి వారైనా ఊరుకోమని హెచ్చరించారు. రసాయనాలు కలిపిన కల్లు వల్లే అనారోగ్యపాలవుతున్నారన్నారు. తెలంగాణలో కల్తీ కల్లు మరణాలు లేవని స్పష్టం చేశారు. అదేవిధంగా గుడుంబాపై ఉక్కు పాదం మోపుతామని తెలిపారు.

కాగా జిల్లాలో  కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై 256 మంది ఆస్పత్రి లో చేరారు. ఇందులో 62 మంది మహిళలు ఉన్నారు. ప్రమాదకర పదార్థాలను కలిపిన కల్లును తాగిన వారు  వింతగా ప్రవర్తిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement