‘వైరస్‌’ల ఆటబొమ్మ మన శరీరం

ABK Prasad Article On Coronavirus - Sakshi

రెండో మాట 

విషక్రిముల కారణంగా ప్రబలిన రోగాలలో 60 శాతం రోగాలు ఉత్తర అమెరికా, యూరప్‌లలోనివే అని పరిశోధకులు తేల్చారు. కానీ సిద్ధాంత విభేదాల పేరిట పెట్టుబడిదారీ దేశాల అధినేతలు,  ప్రభుత్వాలు కొన్ని ఈ ‘విష క్రిముల’ వ్యాప్తిని సోషలిస్టు దేశాలు బయటికి పొక్కనివ్వకుండా అణచివేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. నిజానికి చైనాలో ప్రబలిన తాజా ‘కరోనా వైరస్‌’ మహమ్మారి ఉదంతాన్ని వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపి, ప్రపంచ దేశాలను హెచ్చరించవలసిందిగా బీజింగ్‌ ప్రభుత్వం కోరిందని పెట్టుబడిదారీ పత్రికలే ప్రకటించాయి. తొలి అణుబాంబుతో నాగసాకి, హిరోషిమాలను నామరూపాల్లేకుండా చేసింది సామ్రాజ్యవాద ప్రభుత్వాలే అని మర్చిపోవద్దు. అదే సమయంలో మానవ శరీరమే అంతరంగంలో అనుకూల, ప్రతికూల సూక్ష్మజీవుల మధ్య నిరంతర పోరాట వేదిక అని మరవరాదు!

ఎప్పటికప్పుడు కొత్తగా మానవాళిని పీడి స్తున్న విషక్రిమి కీటకాదుల బారినుంచి  తప్పిం చుకునే క్రమంలో ఆరోగ్య రక్షణ కోసం తీసుకోవలసిన తొలి చర్య– నిరంతర నిఘా. మానవుల ఉనికినే దెబ్బతీసే ఈ పరాన్నభుక్కులైన విష క్రిముల సంహారం ప్రపంచ దేశాల ప్రభుత్వాల సామూహిక దాడి వల్లేనే సాధ్యం. అలా చేసినప్పుడే విశ్వవ్యాప్తంగా రోజులలోనే ఈ విష క్రిముల దాడి నుంచి  మానవులను రక్షించుకోగలం. కొత్తగా తలెత్తే విష క్రిములను శరవేగంతో కనిపెట్టి ఎదుర్కొని రూపుమాపగలం. ఇందుకు అన్ని దేశాల ప్రభుత్వాలకూ రాజకీయ సంసిద్ధత, మౌలికమైన పరి శోధనలకు తగిన సాధన సంపత్తి, శక్తియుక్తులు అవసరం. ఇది సమ ర్థవంతంగా జరిగిన నాడే హెచ్‌ఐవి–1 (ఎయిడ్స్‌), సార్స్, ఎబోలా, కరోనా లాంటి తాజా భయంకర విషక్రిముల వ్యాప్తిని అరికట్టగలం.
– మార్క్‌ ఉడ్‌ హౌస్‌ ఫియోనా స్కాట్, జీ హడ్సన్,
రిచర్డ్‌ హోయీ, మార్గోఛేజ్‌ టాపింగ్‌ సౌజన్యంతో
‘హ్యూమన్‌ వైరసెస్స్, డిస్కవరీ అండ్‌ ఎమర్జెన్సీ’

మానవ, మానవేతర జీవజాలం బతుకంతా పరస్పర ఆశ్రయంతో సాగుతున్నంతకాలం విష క్రిముల పుట్టుక, వాటి వ్యాప్తి నుంచి పూర్తిగా తప్పించుకోలేమన్నది పరిణామ క్రియ. ఇప్పటికి మానవాళికి సోకిన ప్లేగు మహమ్మారి బ్రిటన్‌లో పుట్టి ఇండియాలోని సూరత్‌ పట్టణం దాకా వ్యాపించి వేలు లక్షల సంఖ్యలో ప్రజల్ని బలిగొంది. అలాగే తాజాగా మన ఇరుగుపొరుగైన చైనాలో కొత్తగా పుట్టిన మరో మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాధి భారతదేశం సహా 21 దేశాలకు వ్యాపించి భయాందోళనలకు కారణమవుతోంది.  చైనాలోని రెండు మూడు రాష్ట్రాలకు ఈ సరికొత్త కరోనా వైరస్‌ పరిమితమైనట్లు కని పిస్తున్నా అనేక దేశాలు చైనా నుంచి విమాన ప్రయాణాల రాకపోక లను నిషేధించవలసి వచ్చింది. భారత్‌ సహా ఇతర దేశాలనుంచి చదువుసంధ్యల నిమిత్తం వచ్చి వివిధ వృత్తి విద్యల్లో నైపుణ్యం కోసం చైనాలోని ప్రముఖ విద్యా కేంద్రాలలో అభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యా ర్థులంతా ఆందోళనలో ఉన్నారు.

 అంతర్జాతీయ వైద్యనిపుణులు, విషక్రిముల అంతర్జాతీయ పరిశో ధనా కేంద్రం అంచనా ప్రకారం ఇంతవరకు ప్రపంచంలో ఆచూకీ దొరి కిన వైరస్‌ల సంఖ్య 219 అని తేలింది. మానవులలో క్రిమివ్యాప్తి కార కాలైన 23 విషక్రిమి కుటుంబాలను పరిశోధకులు గుర్తించారు. ఈ క్రిమి కుటుంబాల తబిశీళ్లను 105 సంవత్సరాల మీదట వైద్య సాంకే తిక పరిశోధకులు కనిపెట్టగలిగారు. పశువుల నుంచి, గబ్బిలాలు, చుంచులు, పాములు, పందులు వగైరా మానవేతర జీవుల నుంచి ప్రధానంగా ఈ విషక్రిములు ప్రబలుతుంటాయి. సరికొత్త కరోనా వైరస్‌ తాజాగా ప్రబలేవరకూ చరిత్రలో ఇంతవరకూ మానవులను పీడించిన విషక్రిములలో పాపిలోమా, వెసెక్యులార్‌ సొమాటిస్‌ వైర స్‌లు ముఖ్యమైనవని శాస్త్రవేత్తల అంచనా. 1892లో టొబాకో మొజా యిక్‌ వైరస్‌ను కనిపెట్టగా, పశువుల కాళ్లకు, నోటికి (ఫుట్‌ అండ్‌ మౌత్‌) సోకే ‘గాలి’ వ్యాధి క్రిమిని శాస్త్రవేత్తలు 1898లో కనుగొన్నారు. మాన వులకు సోకిన తొలి ఎల్లో ఫీవర్‌ వైరస్‌ క్రిమిని 1901లో కనిపెట్టారు. అంతేగాదు, ఇప్పటికీ మానవులకు సోకే మూడు నాలుగు రకాల వైరస్‌లను ఏటా కొత్తగా కనిపెడుతూనే ఉన్నారు. అలాగే, ఇంతకు ముందెన్నడూ కనిపెట్టని సరికొత్త విషక్రిముల (బాక్టీరియా, ఫంగీ) రకాల్ని కూడా కనిపెడుతున్నారు.

ఇలా విషక్రిముల కారణంగా ప్రబలిన రోగాలలో 60 శాతం రోగాలు ఉత్తర అమెరికా, యూరప్‌లలోనివే అని పరిశోధకులు తేల్చారు. గత 15 ఏళ్లలో ‘ఆస్ట్రలేషియా’లో ఈ రోగాలు ప్రబలి నాయని పరిశోధకులు నిర్ధారణ చేశారు. ఇవిగాక 1954 నుంచీ సగ టున ఏడాదికి సుమారు 4 రకాల విష క్రిములను శాస్త్ర పరిశోధకులు కనిపెడుతూ వచ్చారు. బహుశా కొత్తగా వీటి సంఖ్య పెరగవచ్చునని కూడా ఒక అంచనా. ఇంతవరకు ‘అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందన్న’ జోకు వ్యాప్తిలో ఉండేది. కానీ, ఇప్పుడు ఇరుగు పొరుగు తుమ్మినా దేశాంతరాలకు, దూరతీరాలకు కూడా వ్యాపిస్తుం దన్న కొత్త సామెతకు మనం అలవాటుపడాలి. ఇందులో మళ్లీ సిద్ధాంత విభేదాల పేరిట పెట్టుబడిదారీ దేశాల అధినేతలు లేదా ప్రభుత్వాలు కొన్ని ఈ ‘విష క్రిముల’ వ్యాప్తిని సోషలిస్టు దేశాలు బయటికి పొక్క నివ్వకుండా అణచివేస్తున్నారని ఆరోపిస్తున్నాయి.

కానీ, భయాందోళ నల ద్వారా ప్రజలలో అలజడి కల్గించకుండా బాధ్యతగల ప్రభుత్వాల మొత్తం కేంద్రీకరణంతా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కోవడంపైనే ఉండాలని సోషలిస్టు దేశాలు భావిస్తున్నాయి. వియత్నాం దురాక్ర మణ సందర్భంగా అమెరికన్‌ పెట్టుబడిదారీ సామ్రాజ్య పాలకులు వియత్నాం పంటపొలాలపై విషక్రిమి ప్రయోగం జరిపి, 15 ఏళ్లపాటు పంటలు పండకుండా చేశారని మరచిపోరాదు. కానీ, పెట్టుబడిదారీ పత్రికలే.. చైనాలో ప్రబలిన తాజా ‘కరోనా వైరస్‌’ మహమ్మారి ఉదం తాన్ని వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపి, ప్రపంచ దేశాలను హెచ్చరించ వలసిందిగా బీజింగ్‌ ప్రభుత్వం కోరిందని ప్రకటించాయి. అయితే కొత్త వైరస్‌ను గుర్తించడంలో కొంత ఆలస్యమైన మాట నిజమే నని చెబుతూ ఇందుకు కారణమైన స్థానిక అధికార గణాన్ని, స్థానిక కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల్ని కూడా స్థానిక నాయకత్వం హెచ్చరించి, సత్వర చర్యలు తీసుకున్నట్టు ప్రపంచ పత్రికలు పేర్కొన్నాయి.

 అంతేగాదు, చైనాలోని సెంట్రల్‌ ప్రావిన్స్‌ అయిన హూబే రాష్ట్రంలోని భారతీయ విద్యార్థుల్ని స్వదేశానికి పంపడానికి అటువైపు నుంచి చైనా, ఇటునుంచి భారత్‌ పాలకులు ప్రయత్నిస్తున్న సమ యంలో అక్కడి మన విద్యార్థులు, వూహాన్‌ నగరంలోని బట్టల పరి శ్రమకు చెందిన విశ్వవిద్యాలయంలో పనిచేసే భారతీయ ప్రొఫెసర్‌ అశోక్‌ కుమార్‌ యాదవ్, ఆయన భార్య నేహా యాదవ్‌ చెప్పిన మాటల్ని ‘వైర్‌’ సంస్థ ప్రతినిధి దేవిరూపమిత్రా ఇలా వివరించడం గమనార్హం. ‘కరోనా వైరస్‌ మహమ్మారి ఇతర చోట్లకి పాకిపోకుండా కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగానే చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించినందున చైనీస్‌ నగరాలలో ఉండే భారతీయులు తమ గదు లకు, డార్మెటరీలకు పరిమితం కావలసి వచ్చింది’. ఇందుకు కారణం– కరోనా వైరస్‌ వ్యాధి ఒక శరీరం నుంచి ఆగమేఘాలమీద, క్షణం వ్యవధి లేకుండా ఇన్‌ఫెక్ట్‌ అయిందన్న సూచన కూడా కనబడనంత వేగంగా పొరుగు వ్యక్తికి సోకుతుండటమే! ప్రొఫెసర్‌ యాదవ్‌ మరో మాట కూడా చెప్పారు. ‘ఇప్పుడు మేమిక్కడ సురక్షితంగానే ఉన్నాం. ఈ పరిస్థితిలో మేము ఇండియాకి చేరుకోవడమంటే మా ద్వారా దేశమంతా ఈ మహమ్మారి పాకిపోతే, చైనా లాగా మనం పరిస్థితిని అదుపు చేయలేం’ అన్నారు.

 అంతేగాదు, ‘ఇప్పుడు చైనాలో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. అందుకని ఇండియాకు వెళ్లొద్దనుకున్నాను’ అన్నాడు ఆశీష్‌ యాదవ్‌. అంతేగాదు, హూపెలో మెడిసిన్‌ చదువుతున్న 23 ఏళ్ల ‘ఇంటర్న్‌షిప్‌’ విద్యార్థిని వర్షిణి శ్రీనివాస్‌ తన కోర్సు పూర్తి అయితే గానీ కదలనని భీష్మించింది. ఎందుకని? ‘యూనివర్సిటీ అధికారులు ఆదర్శవంతమైన పరిసరాలను కాపాడేందుకుగాను బిల్డింగ్‌ వరండా లను, రోజుకు రెండేసిసార్లు పరిశుభ్రంగా బాగు చేసి ఉంచుతున్నారని’ వర్షిణి చెప్పింది.

ఇంతకూ అమెరికా, ఫ్రాన్స్‌ తదితర సామ్రాజ్యవాద దేశాలు ‘సందోయ్, సందోయ్‌’ అన్నట్టు చైనా విధానాల్ని వ్యతిరేకిస్తున్న దేశాలను బదనాం చేయడానికి చైనా ప్రభుత్వం ‘కరోనా వైరస్‌’ను కృత్రిమంగా సృష్టించినట్టు ప్రచారం చేసిన విషయాన్ని ఈ సంద ర్భంగా మరవరాదు. అలా చైనా కృత్రిమ వైరస్‌ను కావాలని సృష్టించి ఉంటే, కరోనా వైరస్‌ సమాచారంపై వెంటనే ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలను అప్రమత్తం చేస్తూ అధికారికంగా ఎందుకు సమాచారాన్ని అందించవలసి వచ్చిందో సమాధానం లేదు. నిజానికి ఈ రెండు సామ్రాజ్యవాద ప్రభుత్వాలే ఆసియా, ఆఫ్రికా దేశాలను దురా క్రమణ యుద్ధాలలో ఇరికించి ప్రజలను బికారులను చేసి వదిలిన పాలకులనీ, తొలి అణుబాంబుతో నాగసాకి, హిరోషిమాలను నామ రూపాల్లేకుండా చేసిన పచ్చి పుండాకోరులని మరువరాదు. మానవ శరీరమే అంతరంగంలో అనుకూల, ప్రతికూల సూక్ష్మజీవుల మధ్య నిరంతర పోరాట వేదిక అని మరవరాదు!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top