వారఫలాలు

Varaphalalu in this week - Sakshi

9 సెప్టెంబర్‌ నుంచి 15 సెప్టెంబర్‌ 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. ఆర్థికంగా బలపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు దక్కుతాయి. గృహం, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు  మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభించవచ్చు. రాజకీయవర్గాలకు ప్రయత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో కలహాలు. పసుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసమస్యలు. ఎరుపు, లేతనీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. 

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. కుటుంబసభ్యుల ఆప్యాయత పొందుతారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. పనులు నిదానంగా సాగుతాయి. ఆప్తులు, మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు కలసిరావు. నిర్ణయాలు పునఃసమీక్షిస్తారు. పెద్దల సలహాలు పాటిస్తారు. వేడుకలలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు.  ఇంటాబయటా ఒత్తిడులు. భాగస్వామ్య వ్యాపారాలలో సామాన్యలాభాలు.  ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. రాజకీయవర్గాలకు పదవులు అసంతృప్తి కలిగిస్తాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు. స్వల్ప «దనలాభం. తెలుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులలో ఆటంకాలు తొలగుతాయి. పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఇంటి నిర్మాణయత్నాలు  ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
రుణాలు తీరి ఊరట చెందుతారు. రావలసిన డబ్బు అందుతుంది. సోదరులు, మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. నిరుద్యోగులు, విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. మీపై వచ్చిన ఆరోపణలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు సత్కారాలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. తెలుపు, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివారాధన మంచిది.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పనులు చకచకా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. తీర్థయాత్రలు చేస్తారు. ఒక సమాచారం విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు. నీలం, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివారాధన మంచిది.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. కోర్టు వివాదాల నుంచి బయటపడతారు. సోదరులతో ఆనందంగా గడుపుతారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో మంచీచెడ్డా విచారిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సూచనల మేరకు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.  ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం. వారం  ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ప్రారంభంలో చికాకులు, సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యం, ఓర్పుతో అధిగమిస్తారు. మీపై ఉంచిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు మరింత చురుగ్గా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆస్తి వివాదాలు. నేరేడు, చాక్లెట్‌ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు రాగలవు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు. తెలుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. గృహ నిర్మాణం, కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో
( సెప్టెంబర్‌ నుంచి 15 సెప్టెంబర్‌  2018 వరకు)

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
జీవితం ఉత్తేజభరితంగా ఉంటుంది. నిశ్శబ్దంగా మీ జీవితంలోకి ప్రవేశించే ఒక కొత్త వ్యక్తి మీలో ఉద్విగ్నితను రేకెత్తించే సూచనలు ఉన్నాయి. కొత్తగా పరిచయమైన ఆ వ్యక్తి కొంత ప్రమాదకరంగా అనిపించవచ్చు. అలాంటి వ్యక్తితో అనుబంధాన్ని పెంచుకునే ముందు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. గడువులోగా నిర్దేశిత లక్ష్యాలను అందుకోవడం కష్టంగా పరిణమిస్తుంది. కుటుంబంలో చోటు చేసుకునే కొన్ని అవాంఛిత సంఘటనలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేస్తాయి.
లక్కీ కలర్‌: తుప్పు రంగు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
అద్భుతమైన వారం. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కనీసం మీ ఊహకైనా అందని సరికొత్త రంగాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు వాటంతట అవే వచ్చి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. స్ఫూర్తిమంతమైన ఈ పరిస్థితిని మీరు అడుగడుగునా ఆస్వాదిస్తారు. భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. సురక్షితంగా భద్రతావలయంలో ఉన్న అనుభూతి మాత్రమే మీకు సంతోషాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నూతనోత్తేజాన్నిస్తాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.
లక్కీ కలర్‌: ముదురు నారింజ

మిథునం (మే 21 – జూన్‌ 20)
మీ అంతరంగంలో చోటు చేసుకుంటున్న మార్పును మీ అంతట మీరే గుర్తించగలుగుతారు. భవిష్యత్తుపై ఎన్నడూ లేనంతగా ఆత్రుత చెందుతారు. జరిగిన సంఘటనలను పైపేనే కాకుండా వాటి లోలోతులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. భావసారూప్యత గల మిత్రులతో మీ భావోద్వేగాలను పంచుకుంటారు. కొత్త వ్యక్తులతో స్నేహం చేయాలనుకుంటారు. వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో యవ్వనోత్సాహంతో ఉరకలేస్తారు. తెలివితేటలతో గుర్తింపు పొందుతారు. సుదూర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: బంగారు రంగు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతారు. విమర్శలు చేసే వారి మీద విరుచుకుపడతారు. పరిస్థితుల మధ్య బందీగా చిక్కుకుపోయినట్లు భావిస్తారు. ఇప్పటికే ప్రేమానుబంధాల్లో ఉన్నట్లయితే అవరోధాలుగా మారిన అనుబంధాల నుంచి బయటపడతారు. ఒంటరిగా ఉంటున్నట్లయితే సరైన జోడీ కోసం ఆచి తూచి వెదుకులాట సాగించాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలకు అవకాశాలు పరిమితంగానే ఉంటాయి. స్వయంకృషితో కొత్త అవకాశాలను సృష్టించుకుంటారు. విద్యార్థులు ఉన్నత పరీక్షల్లో ఘనమైన విజయాలు సాధిస్తారు.
లక్కీ కలర్‌: నీలం

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
మారాల్సిన సమయం ఇది. ఇదివరకటి మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా వదులుకుని మీ ప్రస్తుత వ్యక్తిత్వానికి నిబద్ధులవుతారు. ఆత్మావలోకనానికి తగిన సమయం కేటాయించుకోవడం మంచిది. ఇప్పటి పరిస్థితులు ఇలాగే కొనసాగాలనే అనవసర తాపత్రయాన్ని వదులుకుని, అనివార్యమైన మార్పులకు మనస్పూర్తిగా ఆహ్వానం పలుకుతారు. పిల్లల యోగక్షేమాల కోసం సమయాన్ని కేటాయిస్తారు. వారి ఆసక్తులను నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
పీడకలలు వెంటాడతాయి. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి తగిన అవకాశాలు దక్కుతాయో లేదోననే ఆందోళన వెంటాడుతుంది. మిమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపే వ్యక్తుల సమక్షంలో కొంత ఊరట పొందుతారు. వారి ఆసరాతో మీ ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటారు. మీకు మీరే అత్యంత ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడతారు. కష్టనష్టాలన్నింటినీ తట్టుకుని విజయవంతంగా లక్ష్యాలను సాధిస్తారు. పని ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు.
లక్కీ కలర్‌: లేతనీలం

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఆశ్చర్యకరమైన కొత్త అనుభవాలు ఎదురవుతాయి. కలలను సాకారం చేసుకుంటారు. కొత్త దిశలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు కుదిరే సూచనలు ఉన్నాయి. సౌందర్య పోషణపై, అలంకరణపై శ్రద్ధ చూపుతారు. శరీరాకృతిని మెరుగుపరచుకునేందుకు వ్యాయామం ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆశించిన లక్ష్యాలను అందుకోవడంతో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. కీలకమైన అంశాల్లో సన్నిహితుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. 
లక్కీ కలర్‌: గోధుమరంగు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో నాయకత్వ పాత్రలో రాణిస్తారు. పితూరీలు చెప్పేవారిని దూరం పెడతారు. వ్యతిరేక ప్రచారాలను తిప్పికొడతారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యల నుంచి బయటపడటానికి ఆచి తూచి అడుగులు వేస్తారు. ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి అనుబంధాల్లో ప్రతిష్టంభన ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మొండితనం వీడి పట్టు విడుపులు ప్రదర్శించడం మంచిది. సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు.
లక్కీ కలర్‌: కెంపురంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
స్తబ్దత తొలగిపోతుంది. తలపెట్టిన పనుల్లో వేగం పుంజుకుంటుంది. ఏకకాలంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో దూకుడు కొనసాగిస్తారు. వ్యాపారాల్లో లాభాలు రెట్టింపవుతాయి. సన్నిహిత వర్గాల చర్చల్లో మీరే కేంద్ర బిందువుగా ఉంటారు. ప్రగాఢంగా మార్పును కోరుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాయామంపై శ్రద్ధ పెంచుకుంటారు. ధ్యానంతో సేదదీరుతారు.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
వారమంతా సంతోషభరితంగా సాగుతుంది. నవ్వుతూ తుళ్లుతూ మిత్రులతో కాలక్షేపం చేస్తారు. పరిమితులను పట్టించుకోకుండా ఇతరులను ఆదుకుంటారు. ఔదార్యాన్ని చాటుకుంటారు. ప్రియతముల మధ్య ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. ఆస్తుల అమ్మకాల్లో ఊహించని స్థాయిలో లాభాలను అందుకుంటారు. పిల్లలు సాధించిన విజయాలు మీ పేరు ప్రతిష్ఠలను మరింతగా పెంచుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను స్వీకరిస్తారు. నాయకత్వ పాత్రలో సత్తా నిరూపించుకుంటారు. ఆర్యోగంపై శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు.
లక్కీ కలర్‌: బూడిద రంగు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. సమస్యల చిక్కులన్నీ ఒక్కొక్కటే విడిపోతాయి. పరిస్థితులు నెమ్మదిగా చక్కబడతాయి. వృత్తి ఉద్యోగాల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారరంగంలోని వారికి భవిష్యత్తులో లాభసాటి కాగల కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులు పంతాలు వదులుకొని, అహాన్ని పక్కనపెడితే సమస్యలు వాటంతట అవే చక్కబడతాయి.
లక్కీ కలర్‌: ముదురు ఊదా

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
మీ నిర్ణయాలను, విశ్వాసాలను సమర్థించుకుంటారు. మీదైన వైఖరికి కట్టుబడి ఉంటారు. శక్తికి మించిన భారం మోస్తున్నట్లుగా భావిస్తారు. పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని గుర్తిస్తారు. పని ఒత్తిడి ఉన్నా, పనికీ కుటుంబానికి మధ్య సమతుల్యత సాధించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామితో తలెత్తిన అపార్థాలను తొలగించుకుంటారు. మార్పులను స్వీకరిస్తారు. ప్రశాంతత కోరుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణం చేసే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధిస్తారు. సద్గురువుల అనుగ్రహం పొందుతారు.
లక్కీ కలర్‌: గులాబి
ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top