టారో :12 ఫిబ్రవరి నుంచి 18 ఫిబ్రవరి 2017 వరకు


మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)

అవసరాలకు తగిన డబ్బు చేతికందుతుంది. సంతోషంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టు లేదా పనిని ప్రారంభించాలన్న ఉత్సాహంతో ఉంటారు. పెట్టుబడులకు ఇది తగిన సమయం. ప్రేమికులకు ఆశాభంగం తప్పదు. ఏకాంతంగా ఉన్నప్పుడు ధ్యానం చేయండి, కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవితం అనే నౌక పూర్తిగా మన చేతుల్లో ఉండదు. ఒకోసారి గాలివాలును బట్టి దిశను మార్చుకోవచ్చు.

కలిసొచ్చే రంగు: గులాబీవృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)

ప్రేమలో కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. జీవిత లక్ష్యాలను సాధించాలని దృఢంగా నిశ్చయించుకుంటారు. ఆ ప్రయత్నంలో కొద్దిగా ముందడుగు వేస్తారు కూడా! పాజిటివ్‌ ఆలోచనలతో ఉంటారు. ఇతరుల సమస్యలను విని, మీకు చేతనైన సాయం చేస్తారు. అలా సాయం చేయడం వల్ల ఆనందాన్ని పొందుతారు. మీరు విద్యార్థులైతే మంచి మార్కులు సాధించి, అందరినీ ఆకట్టుకుంటారు.

కలిసొచ్చే రంగు: బూడిద రంగుమిథునం (మే 21 – జూన్‌ 20)

వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలన్నట్లుగా సాగుతుంది. మీకు కావలసిన వారికోసం బాగా ధనం ఖర్చు చేస్తారు. గత జ్ఞాపకాలతో కుంగిపోకుండా, వాటినుంచి పాఠాలను నేర్చుకునే ప్రయత్నం చేయడం మంచిది. మీ సమస్యలకు పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేస్తారు. వాహనాలను నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండటం అవసరం. జీవిత భాగస్వామి కోసం అన్వేషించే ప్రయత్నాలు ఫలిస్తాయి.

కలిసొచ్చే రంగు: నీలంకర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)

మీ సన్నిహితులతో వీలయినంత నిజాయితీగా, నిర్మొహమాటంగా వ్యవహరించడం మంచిది. దానివల్ల లేనిపోని అపార్థాలు తలెత్తకుండా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లేదా వ్యవహారాలు అనుకూలిస్తాయి.  ఇతర వ్యాపకాలలో పడి వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకోవద్దు.

కలిసొచ్చే రంగు: నారింజసింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)

రకరకాల కారణాల వల్ల పని పేరుకుపోవడంతో అవిశ్రాంతంగా శ్రమించవలసి వస్తుంది.  దానివల్ల మీకు మంచి పేరు వస్తుంది. ఒకోసారి సమస్యలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. టెన్షన్‌ పడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం వల్ల భవిష్యత్తులో దృఢంగా ఉంటారు. విందు, వినోదాలు, దూరపు ప్రయాణాలతో సేదతీరే ప్రయత్నం చేస్తారు. ప్రేమ వ్యవహారాలలో నిర్ణయం తీసుకోవలసి వస్తుంది.

కలిసొచ్చే రంగు: తెలుపు, వంగపువ్వుకన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)

వారమంతా క్షణం తీరుబడి లేకుండా గడుపుతారు. అవిశ్రాంతంగా పని చేసినా, చురుగ్గా ఉంటే కానీ, పనులు తొందరగా పూర్తి కావని గ్రహించండి. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు మరింత పదును పెట్టుకుని, శ్రద్ధాసక్తులతో పనిని పూర్తి చేస్తారు. మీ ప్రేమ ఫలిస్తుంది. విందు, విహార యాత్రలను ఆనందించడానికి ఆరోగ్యం అనుకూలం.

కలిసి వచ్చే రంగు: వెండితుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)

జీవితంలో ఎప్పుడూ గెలుపు మనదే అనుకోవడం పొరపాటు. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవడం అవివేకం. ఎందుకంటే ఓడినప్పుడే కదా, మీ శక్తిసామర్థ్యాలు మీకు తెలిసేది. వృత్తినైపుణ్యాన్ని పెంచుకుంటారు. మంచి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెంచుకుంటారు. పద్ధతి ప్రకారం పనులు పూర్తి చేసి, ప్రశంసలు పొందుతారు.

కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చవృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)

పాతబంధాలు బలపడతాయి. దానితోబాటు మీ స్నేహితులు, బంధుమిత్ర సన్నిహితుల జాబితాలో కొత్తపేర్లు చేరతాయి. వెన్నునొప్పి బాధించవచ్చు. అయితే అలాంటి ఆరోగ్య సమస్యలకు అనవసరమైన ఆందోళన మాని, ప్రకృతి ఉత్పాదనల వాడకంతో మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతారు. జీవితమంటే ఎప్పుడూ పని, పరుగులే కాదు, కాస్త విశ్రాంతి, ప్రేమ, ఉల్లాసం కూడా అవసరం అని తెలుసుకోండి.   

కలిసివచ్చే రంగు: ఆకుపచ్చధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)

భద్రతకు, విజయానికి ప్రాధాన్యత ఇస్తారు. ఊహించినంత ఆనందంగా, సాఫీగా రోజులు గడవడం లేదనిపిస్తుంటుంది. అయితే, ప్రణాళికాబద్ధంగా చేయడం వల్ల తగిన ఫలితం ఉంటుందని గ్రహించండి. వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. మీ రుగ్మతలకు సంగీత చికిత్స ఉపకరిస్తుంది.

కలిసివచ్చే రంగు: లేత వంకాయరంగుమకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)

మీది కాని కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. ప్రకృతి ఉత్పాదనలు, స్వచ్ఛమైన గాలి, నీరు వల్ల స్వాంతన పొందుతారు.

కలిసి వచ్చే రంగు: వెండికుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)

 ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను నెరపడంలో, వాటిని మరింత మెరుగు పరచుకోవడంలో మీకు మీరే సాటి అన్నట్లుగా ఉంటారు. ఆందోళన మాని వృత్తిగతమైన మెలకువలతో పని చేయండి. సహోద్యోగులకు మీ ఆలోచనలు నచ్చకపోవచ్చు. మనసు చెప్పినట్లు నడచుకోండి. చెవి లేదా గొంతునొప్పి బాధించవచ్చు.

కలిసి వచ్చే రంగు: ఎరుపుమీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)

ఆర్థికంగా చాలా బాగుంటుంది. చెడు అలవాట్లకు స్వస్తి పలకాలని నిశ్చయించుకుంటారు. అలా ఎన్నోసార్లు. కానీ, చెడ్డ అలవాట్లు అలవడినంత తొందరగా వదలవని గ్రహిస్తారు. మీ జీవిత భాగస్వామి ధోరణి మీకు నచ్చకపోవచ్చు. మీ వైఖరి వారికి ఇష్టం లేకపోవచ్చు. కానీ, ఒకరికొకరు సర్దుకుపోయి. సామరస్యంగా జీవించడమే కదా జీవితం. అదృష్టం వరిస్తుంది.

కలిసొచ్చే రంగు: ఊదా

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top