మిల మిల మెరిసే మీనాక్షి!

Sonakshi Sinha is not just an actress and she is a painter too - Sakshi

సోనాక్షి సిన్హా నటి మాత్రమే కాదు...చక్కగా బొమ్మలు గీస్తుంది. అంతకంటే చక్కగా పాడుతుంది. ‘దబాంగ్‌–3’లో ‘రజ్జో పాండే’గా మరోసారి అలరించనుంది. ‘సంతోషం సగం బలం... ఆ బలం పనిలోనే ఉంది’ అంటున్న సోనాక్షి చెప్పిన కొన్ని ముచ్చట్లు...

గొప్ప ఔషధం
ఎలాంటి సమస్య నుంచి బయట పడడానికైనా ఒక ఔషధం ఉంది. అదే పని! పనిలో తలమునకలైపోతే ఎలాంటి సమస్యను అయినా అధిగమించవచ్చు. ఇది నేను సొంత అనుభవంతో చెబుతున్న మాట. తీరిక సమయాల్లో జిమ్‌లో గడపడం, పెయింటింగ్, స్కెచ్చింగ్‌ వేయడం, సినిమాలు చూడడంలాంటివి చేస్తుంటాను.

ఆత్మవిశ్వాసం
వుమెన్‌ ఓరియెంటెడ్‌ సినిమాల్లో నటించాలని ఉంది. ‘అకిరా’ సినిమా తరువాత ఆచితూచి పాత్రలు ఎంచుకుంటున్నాను. టైటిల్‌ రోల్‌ పోషించిన  నా సోలో ఫిల్మ్‌ ఇది. ఇది నాలోని ‘స్కిల్స్‌’ని నాకు తెలియజేసిన సినిమా. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన సినిమా. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని ఉంది. చాలెంజింగ్‌గా ఉండే స్క్రిప్ట్‌లను ఇష్టపడతాను. అప్పుడు మనలో  మరోకోణం పరిచయమవుతుంది.

మల్టీస్టారర్‌ సినిమాలు
మల్టీస్టారర్‌ సినిమాల్లో నటించడం వల్ల నటులలో అభద్రతాభావం తలెత్తితే...హాలీవుడ్‌లోగానీ, బాలీవుడ్‌లోగానీ ఎన్నో మంచి సినిమాలు వచ్చి ఉండేవి కావు. నాకు అలాంటి భయాలేమీ లేవు.  ‘కళంక్‌’ సినిమాలో మాధురీ దీక్షిత్, సంజయ్‌ దత్, ఆలియా భట్, వరుణ్‌లతో నటించడం మంచి అనుభవం!

సంతోషం
జీవితంలో నా మొదటి ప్రాధాన్యత...ఎప్పుడూ సంతోషంగా ఉండడం! నేను సంతోçషంగా ఉండడం ఎంత ముఖ్యమో అవతలి వ్యక్తిని సంతోషంగా ఉంచడం అంతే ముఖ్యమని నమ్ముతాను. సానుకూల దృక్పథంతో ఉండడానికి ప్రయత్నిస్తాను.  ఈ ప్రభావం చేసే పని మీద పడి చురుగ్గా ఉండగలుగుతాం.

చదువు
చదివిన చదువు ఎప్పుడూ వృథా పోదు. నటి కావడానికి ముందు మూడు సంవత్సరాలు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేశాను. అక్కడ ఎంతో నేర్చుకున్నాను. అలా నేర్చుకున్నది ఇప్పుడు ఏదో ఒకచోట ఉపయోగ పడుతూనే ఉంది. ఉదాహరణకు సెట్‌లో ఉన్నప్పుడు ‘క్విక్‌ అల్టరేషన్‌’ అవసరమైంది అనుకోండి... సై్టలిస్ట్‌లు, డిజైనర్లకు ఏంచేయాలో చెబుతాను. ఇది నా వృత్తిలో భాగం అనుకుంటాను.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top