
బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్
బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్ బెంగాలీలనే కాదు... హైదరాబాద్ సినీ ప్రియులనూ ఆకట్టుకుంది. బంజారాహిల్స్ ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో ప్రదర్శించిన చిత్రాలు ఇక్కడివారి వునసూ దోచుకున్నారుు.
ఉత్సాహ్
బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్ బెంగాలీలనే కాదు... హైదరాబాద్ సినీ ప్రియులనూ ఆకట్టుకుంది. బంజారాహిల్స్ ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో ప్రదర్శించిన చిత్రాలు ఇక్కడివారి వునసూ దోచుకున్నారుు. వుూడు రోజుల ఈ పండుగ ఆదివారంతో వుుగిసింది. ఇందులో ప్రదర్శించిన సినివూలు వేటికవే ప్రత్యేకత చాటుకున్నారుు. చివరి రోజు బెంగాలీ ఔత్సాహికులు డ్యాన్స్‌లతో ఉల్లాసంగా గడిపారు.
సుర్‌సాగర్
హిందుస్థానీ సంగీతాన్ని పరవళ్లు తొక్కించారు కళాపిని కొంకలి. ప్రముఖ హిందుస్థానీ విద్వాంసుడు కుమార్ గంధర్వ తనయ అయిన కళాపిని సంగీత ఝరికి శ్రోతలు మంత్రముగ్ధులయ్యారు. హుస్సేన్‌సాగర తీరంలో ఆదివారం శాస్త్రీయ సంగీతం, నృత్యం అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న సుర్‌మండల్, హైదరాబాద్ కొంకణి అసోసియేషన్లు కలిసి నిర్వహించిన హిందుస్థానీ సంగీత కచేరీ గంగాప్రవాహంలా సాగింది. కళాపిని రసరవ్యుమైన ఆలాపనకు నగరవాసులు ఆసాంతం ఆస్వాదించారు.