breaking news
Prasad Film Labs
-
బాపు చిత్ర ప్రదర్శనకు ముఖ్య అతిథిగా చిరంజీవి
-
సుకుమార్‌కు కె.వి.రెడ్డి పురస్కార ప్రదానం
సినీ దర్శకుడు సుకుమార్‌ను ‘యువ కళావాహిని’ కె.వి.రెడ్డి చలనచిత్ర దర్శక పురస్కారంతో సత్కరించనుంది. ఈ కార్యక్రమం ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ఫిలింల్యాబ్స్లో జరగనుంది. సారిపల్లి కొండలరావు అధ్యక్షతన ఏర్పాటవుతున్న ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య ముఖ్యఅతిథిగా, ఐపీఎస్ అధికారి డాక్టర్ ఎం.కాంతారావు గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. సినీ నిర్మాత అల్లు అరవింద్ సభను ప్రారంభిస్తారు. కె.రాఘవ, బి.గోపాల్, డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ తదితర సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్
ఉత్సాహ్ బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్ బెంగాలీలనే కాదు... హైదరాబాద్ సినీ ప్రియులనూ ఆకట్టుకుంది. బంజారాహిల్స్ ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో ప్రదర్శించిన చిత్రాలు ఇక్కడివారి వునసూ దోచుకున్నారుు. వుూడు రోజుల ఈ పండుగ ఆదివారంతో వుుగిసింది. ఇందులో ప్రదర్శించిన సినివూలు వేటికవే ప్రత్యేకత చాటుకున్నారుు. చివరి రోజు బెంగాలీ ఔత్సాహికులు డ్యాన్స్‌లతో ఉల్లాసంగా గడిపారు. సుర్సాగర్ హిందుస్థానీ సంగీతాన్ని పరవళ్లు తొక్కించారు కళాపిని కొంకలి. ప్రముఖ హిందుస్థానీ విద్వాంసుడు కుమార్ గంధర్వ తనయ అయిన కళాపిని సంగీత ఝరికి శ్రోతలు మంత్రముగ్ధులయ్యారు. హుస్సేన్‌సాగర తీరంలో ఆదివారం శాస్త్రీయ సంగీతం, నృత్యం అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న సుర్మండల్, హైదరాబాద్ కొంకణి అసోసియేషన్లు కలిసి నిర్వహించిన హిందుస్థానీ సంగీత కచేరీ గంగాప్రవాహంలా సాగింది. కళాపిని రసరవ్యుమైన ఆలాపనకు నగరవాసులు ఆసాంతం ఆస్వాదించారు.