త్వరలో క్యాటరాక్ట్‌కు సర్జరీ లేకుండా చుక్కల మందుతోనే చికిత్స...! | White pearl in the eye | Sakshi
Sakshi News home page

త్వరలో క్యాటరాక్ట్‌కు సర్జరీ లేకుండా చుక్కల మందుతోనే చికిత్స...!

Aug 15 2015 11:54 PM | Updated on Sep 3 2017 7:30 AM

కంటిలో వచ్చే శుక్లం లేదా తెల్ల ముత్యం అనేది వయసు పైబడ్డవారిలో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో బాధించే అంశం...

కొత్త పరిశోధన
కంటిలో వచ్చే శుక్లం లేదా తెల్ల ముత్యం అనేది వయసు పైబడ్డవారిలో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో బాధించే అంశం. దీన్నే ఇంగ్లిష్‌లో క్యాటరాక్ట్ అని కూడా వ్యవహరిస్తారు. చాలామంది దీని కారణంగా పాక్షిక అంధత్వంతో కూడా బాధపడుతుంటారు. కంటి లెన్స్‌ల మీద కొన్ని రకాల ప్రోటీన్లు గుంపులు గుంపులుగా గూడు కట్టడం వల్ల ఆ లెన్స్ పారదర్శకత కోల్పోతుంది. ప్రస్తుతానికి క్యాటరాక్ట్‌కు శస్త్రచికిత్స చేసి పారదర్శకత కోల్పోయిన లెన్స్ స్థానంలో కొత్త లెన్స్ వేయడం ఒక్కటే మార్గం. అయితే అసలు శస్త్రచికిత్స లేకుండానే కేవలం చుక్కల మందుతోనే కాటరాక్ట్‌ను సరిదిద్దే ప్రక్రియ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.

‘లానోస్టెరాల్’ అనే మాలెక్యూల్‌ను కంటిలో చుక్కల మందులాగా వేయడం వల్ల లెన్స్‌పై ఉన్న ప్రోటీన్ల గుంపులు చెదిరిపోయి, క్యాటరాక్ట్‌ను నయం చేయడం సాధ్యమవుతుందని ఇప్పటికీ జంతువుల మీద నిర్వహించిన పరీక్షల్లో తెలిసింది. కొన్ని కుందేళ్లు, కుక్కల కళ్లల్లో లానోస్టెరాల్ వేసి ఆరు వారాల పాటు  పరిశీలించగా వాటిలో క్యాటరాక్ట్ మాయమైంది. ఈ విషయాన్ని ‘నేచర్’ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు. త్వరలో ఈ ప్రక్రియ నిరపాయకరం అనే విషయం పూర్తిగా తేలి మనుషులకూ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. అప్పుడు శస్త్రచికిత్స అవసరం లేకుండానే కేవలం చుక్కల మందుతోనే క్యాటరాక్ట్‌ను తగ్గించవచ్చు. దాంతో శస్త్రచికిత్స అవసరం ఉండదు సరికదా... చికిత్సకు అయ్యే వ్యయం కూడా గణనీయంగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement