ఈ పిల్లలకు చెవులు ఉండవు... కానీ వినపడుతుంది..! | These children do not have ears, but heard | Sakshi
Sakshi News home page

ఈ పిల్లలకు చెవులు ఉండవు... కానీ వినపడుతుంది..!

Sep 10 2015 12:10 AM | Updated on Sep 3 2017 9:04 AM

ఈ పిల్లలకు చెవులు ఉండవు... కానీ వినపడుతుంది..!

ఈ పిల్లలకు చెవులు ఉండవు... కానీ వినపడుతుంది..!

కొందరు పిల్లలు చెవులే లేకుండా పుడతారు. అంతమాత్రాన వీళ్లకు వినిపించదేమో అనుకోకండి.

మెడిక్షనరీ

కొందరు పిల్లలు చెవులే లేకుండా పుడతారు. అంతమాత్రాన వీళ్లకు వినిపించదేమో అనుకోకండి. తలకు ఇరువైపులా కనిపించే చెవులు నిజానికి చెవికి బాహ్యభాగాలే. దీన్ని ఇంగ్లిష్‌లో పిన్నా అంటారు. కొందరిలో ఈ బాహ్య చెవులు అసలే ఉండవు. ఇలా రెండు చెవులూ లేకుండా పుట్టడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. వైద్యపరంగా ఈ కండిషన్‌ను ‘బైలాటరల్ అర్టీషియా మైక్రోషియా’ అంటారు. అసలు చెవులే లేకుండా ఉండే కండిషన్ ‘మైక్రోషియా’లోని అనోషియా అనే గ్రేడ్ కిందకు వస్తుంది.

ఈ ఇలాంటివారిలో బాహ్యచెవి పెరగకపోయినా, చెవిలోపలి భాగాలైన మధ్యచెవి, లోపలి చెవి భాగాలు పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటాయి. వీళ్లకు ఒక శస్త్రచికిత్స చేసి శబ్దతరంగాలు లోపలికి వెళ్లే మార్గాన్ని రూపొందిస్తారు. దాంతో వీళ్లు మమూలుగానే వినవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement