పిచాయ్‌ని టచ్‌ చేసిన అమ్మాయ్‌!

Sundar Pichais Comment On Womens Post About Scoring Zero In Exam - Sakshi

జీరో ట్వీట్‌

ఆ ట్వీట్‌ దగ్గర సుందర్‌ పిచాయ్‌ కళ్లు ఆగిపోయాయి! గూగుల్‌ సీఈవో ఆయన. అంతటి మనిషిని పట్టి ఆపిన ట్వీట్‌ అంటే.. అది మామూలు ట్వీట్‌ అయి ఉండదు అనుకుంటాం. కానీ అతి మామూలు ట్వీట్‌ అది. ‘నాలుగేళ్ల క్రితం.. క్వాంటమ్‌ ఫిజిక్స్‌ పరీక్షలో నాకు జీరో మార్కులు వచ్చాయి. వెంటనే మా ప్రొఫెసర్‌ని కలిశాను. సర్, ఫిజిక్స్‌ని వదిలేసి ఇంకో సబ్జెక్ట్‌ తీసుకోనా అని అడిగాను. అదే నయమేమో అన్నట్లు ఆయనా చూశారు. కానీ ఈరోజు నేను ఆస్ట్రోఫిజిక్స్‌లో పీహెడ్‌.డి. పూర్తి చేశాను.

రెండు అధ్యయన పత్రాలు సమర్పించాను. స్టెమ్‌ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌) ఎవరికైనా కొరుకుడు పడనిదే. గ్రేడ్‌ తక్కువ వచ్చినంత మాత్రాన వదిలేయనవసరం లేదు’ అని శారాఫినా నాన్స్‌ అనే యువతి చేసిన ట్వీట్‌ అది. పిచాయ్‌ని ఆకట్టుకుంది. వెంటనే ‘‘వెల్‌ సెడ్‌ అండ్‌ సో ఇన్‌స్పైరింగ్‌’’ అంటూ ఆమెను అభినందిస్తూ ట్వీట్‌ పెట్టారు. ఓటమి అంటే గెలవలేకపోవడం కాదు. గెలిచేవరకు ప్రయత్నించక పోవడం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top