ఎండ  పెరుగుతోందా!

For the season of the sun Make the body even cooler - Sakshi

పరీక్షల సీజన్‌... ఎండల సీజన్‌ ఒకేసారి రాబోతున్నాయి.పరీక్షలకి ప్రిపేర్‌ అయినట్టే... ఎండలకీ ప్రిపేర్‌ అవ్వాలి.వట్టివేర్ల తెరలు కట్టుకోవడం, కూల్‌సెమ్‌ పెయింట్‌ రూఫ్‌కు వేసుకోవడం,కూలర్లు రెడీ చేసుకోవడం లాంటి ఏర్పాట్లతో పాటు శరీరం, ఉదరం చల్లగా ఉండటానికి కూడా ఏర్పాట్లు చేసుకోవాలి.పెరిగే ఎండకు పెరుగును మించిన విరుగుడు లేదు.వీటిని నేర్చుకోండి... ఎండకు చూపుడు వేలు ఆడించండి.

దహీ పూరీ
కావలసినవి: పానీ పూరీలు – 6; ఉప్పు – తగినంత; కారం – తగినంత; జీలకర్ర పొడి – అర టీ స్పూను; బంగాదుంపలు – 2; బఠాణీలు – అర కప్పు; గ్రీన్‌ చట్నీ – కొద్దిగా; ఖట్టామీఠా చట్నీ కొద్దిగా; సన్న కారప్పూస – కొద్దిగా; పెరుగు – ఒక కప్పు; నల్ల ఉప్పు – చిటికెడు; తరిగిన టొమాటో – 1; తరిగిన ఉల్లిపాయ – 1.

తయారీ: పెరుగులో కొద్దిగా ఉప్పు, నల్ల ఉప్పు, చాట్‌ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.

►బంగాళ దుంపలను ఉడికించి, తొక్క తీసి మెదపాలి

►బఠాణీని ఉడికించాలి.

►ఒక పాత్రలో ఉడికించిన బంగాళ దుంపలు, ఉడికించిన బఠాణీలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్‌ మసాలా వేసి కలిపి పక్కన ఉంచాలి.

►ఒకప్లేట్‌లో పానీ పూరీలను ఉంచి, మధ్యలో చిన్నగా రంధ్రం చేయాలి.

►సిద్ధం చేసుకున్న బంగాళ దుంప మిశ్రమం కొద్దికొద్దిగా ఉంచాలి.

►ముందుగా టేబుల్‌ స్పూను పెరుగు ఒక్కో పూరీ మీద వేయాలి.

►ఖట్టామీఠా చట్నీ, గ్రీన్‌ చట్నీ, ఉల్లి తరుగు, కారప్పూస ఒక దానిమీద ఒకటి వేయాలి.

►చివరగా మళ్లీ పెరుగు వేసి అందించాలి (వెంటనే తినేయాలి)

గుజరాతీకడీ
కావలసినవి: పెరుగు – ఒక కప్పు; నీళ్లు – రెండు కప్పులు; సెనగపిండి – 4 టేబుల్‌ స్పూన్లు; అల్లం + పచ్చిమిర్చి పేస్ట్‌ – ఒక టీ స్పూను; బెల్లం పొడి – ఒక టే బుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – అలంకరించడానికి తగినంత

పోపు కోసం: దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 2; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; ఎండు మిర్చి – 2 (చిన్న ముక్కలు చేయాలి); జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను.

తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, అల్లం + పచ్చిమిర్చి ముద్ద, పెరుగు, బెల్లం పొడి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కలియబెట్టాలి.

►స్టౌ మీద బాణలిలో నెయ్యి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.

►సెనగ పిండి, పెరుగు మిశ్రమం జత చేసి కలియబెట్టి, మంట బాగా తగ్గించాలి.
 
►ఉండలు కట్టకుండా మధ్యమధ్యలో కలుపుతూ సుమారు ఐదు నిమిషాలు ఉడికించి, దింపేయాలి.
 
►కొత్తిమీరతో అలంకరించాలి ∙అన్నంలోకి, పుల్కాలలోకి రుచిగా ఉంటుంది.

దహీ కే కబాబ్‌
కావలసినవి: 
పెరుగు – ఒక కప్పు; నీళ్లు – రెండు కప్పులు; సెనగపిండి – 4 టేబుల్‌ స్పూన్లు; అల్లం + పచ్చిమిర్చి పేస్ట్‌ – ఒక టీ స్పూను; బెల్లం పొడి – ఒక టే బుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – అలంకరించడానికి తగినంత

పోపు కోసం: దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 2; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; ఎండు మిర్చి – 2 (చిన్న ముక్కలు చేయాలి); జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను.

తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, అల్లం + పచ్చిమిర్చి ముద్ద, పెరుగు, బెల్లం పొడి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కలియబెట్టాలి

►స్టౌ మీద బాణలిలో నెయ్యి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి

►సెనగ పిండి, పెరుగు మిశ్రమం జత చేసి కలియబెట్టి, మంట బాగా తగ్గించాలి

►ఉండలు కట్టకుండా మధ్యమధ్యలో కలుపుతూ సుమారు ఐదు నిమిషాలు ఉడికించి, దింపేయాలి

►కొత్తిమీరతో అలంకరించాలి ∙అన్నంలోకి, పుల్కాలలోకి రుచిగా ఉంటుంది. 

దహీ ఆలూ టిక్కీ చాట్‌
కావలసినవి: బంగాళదుంపలు – 2 (మీడియం సైజువి); మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; బియ్యప్పిండి లేదా కార్న్‌ ఫ్లోర్‌ 2 టేబుల్‌ స్పూన్లు; నూనె – 3 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత.

టాపింగ్‌ కోసం: పెరుగు – అర కప్పు; చింతపండు స్వీట్‌ చట్నీ – తగినంత; గ్రీన్‌ చట్నీ – తగినంత; చాట్‌ మసాలా – తగినంత; మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – తగినంత.

తయారీ: బంగాళ దుంపలను ఉడికించి, తొక్క తీసి చేతితో మెదిపి ఒక పాత్రలో ఉంచాలి

►మిరప కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, బియ్యప్పిండి లేదా కార్న్‌ ఫ్లోర్, ఉప్పు జత చేసి కలపాలి

►గుండ్రంగా టిక్కీల మాదిరిగా చేతితో ఒత్తాలి

►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఒత్తి ఉంచుకున్న టిక్కీలను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి

►గ్రీన్‌ చట్నీ, స్వీట్‌ చింతపండు చట్నీలు పైన వేసి, కొత్తి మీరతో అలంకరించి వెంటనే అందించాలి.

పంజాబీ కడీ పకోరా
కావలసినవి: గడ్డపెరుగు – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – 3 కప్పులు; మిరప కారం – అర టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; ఉప్పు – తగినంత; సెనగ పిండి – 8 టేబుల్‌ స్పూన్లు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.

ఆనియన్‌ పకోరా కోసం: ఉల్లి తరుగు – ఒక కప్పు (సన్నగా పొడవుగా తరగాలి); సెనగ పిండి – ఒక కప్పు; మిరప కారం – అర టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; వాము – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని.

పంజాబీ కడీ కోసం: ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం తురుము – ఒక టేబుల్‌ స్పూను; వెల్లుల్లి తరుగు – ఒక టే బుల్‌ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 2; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ: ఒక పాత్రలో పెరుగు పోసి బాగా గిలకొట్టాలి ∙సెనగ పిండి, మిరప కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు జత చేసి, అన్నీ బాగా కలిసేలా కలపాలి ∙నీళ్లు జత చేసి, ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన ఉంచాలి.

ఆనియన్‌ పకోరా తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, వాము, మిరప కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి

►ఉల్లి తరుగు జత చేసి (ఉల్లి తరుగు నుంచి తగినంత నీరు వస్తుంది కనుక నీళ్లు జతచేయనక్కరలేదు. అవసరమనుకుంటే కొద్దిగా జత చేస్తే చాలు)

►బాగా కలిపి, మూత పెట్టి సుమారు గంటసేపు పక్కన ఉంచాలి

►స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, కలిపి ఉంచుకున్న పిండిని పకోడీలుగా నూనెలో వేసి వేయించాలి

►బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకుని పక్కన ఉంచాలి.

కడీ తయారీ: స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసి చిటపటలాడే వరకు వేయించాలి

►ఉల్లి తరుగు జత చేసి బాగా వేయించాలి

►అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, ఎండు మిర్చి జత చేసి మరోమారు వేయించాలి

►పెరుగు మిశ్రమం జత చే సి, మిశ్రమం బాగా చిక్కబడే వరకు కలుపుతుండాలి

►కొద్దిగా వేడి నీళ్లు జత చేయాలి

►ఆనియన్‌ పకోరాలు వేసి కలపాలి 

►గరం మసాలా పొడి చల్లి, బాగా కలియబెట్టి, దింపేసి మూత పెట్టాలి

►అన్నం, లేదా జీరా రైస్‌లలో నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top