వామ్మో.. బంగాళా దుంపలను ఇలాక్కూడా కడుగుతారా? | Aloo Tikki Seller In Ghaziabad Washing Potatoes With His Feet | Sakshi
Sakshi News home page

వామ్మో.. బంగాళా దుంపలను ఇలాక్కూడా కడుగుతారా?

Mar 24 2026 3:39 PM | Updated on Mar 24 2026 4:12 PM

Aloo Tikki Seller In Ghaziabad Washing Potatoes With His Feet

ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారులు ఆటలాడుకుంటున్నారు. అపరిశుభ్రత ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు స్ట్రీట్ ఫుడ్‌ను ఇష్టపడేవారికి షాకయ్యేలా.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో వైరల్‌గా మారింది. దుకాణదారుడు బంగాళా దుంపలను చేతులతో కాకుండా.. ఏకంగా కాళ్లతో.. అది కూడా చెప్పులు వేసుకుని కడుగుతున్న దృశ్యాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

ఘాజీబాద్‌లోని డిఎల్ఎఫ్ అంకుర్ విహార్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో తీసిన మహిళ మాట్లాడుతూ.. ఓ ఆలూ టిక్కీ షాపులో ఈ దారుణం జరుగుతోందని.. తన తల్లి కూడా అక్కడ చాట్ తిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పులు వేసుకుని మరీ బంగాళాదుంపలను కాళ్లతో కడగడం అత్యంత సిగ్గుచేటు అంటూ ఆమె మండిపడ్డారు.

ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. ఘాజీబాద్‌ ప్రాంతం.. బంగాళాదుంపతో పరిశుభ్రతకు కొత్త అర్థాన్ని ఇస్తోందంటూ ఓ నెటిజన్ ఎద్దేవా చేశారు. "వావ్, అద్భుతమైన పరిశుభ్రత!" అంటూ మరొకరు వ్యంగ్యంగా కామెంట్స్‌ పెట్టారు. "మీకు ఇది చూసి అసహ్యం వేస్తోందా? అయితే ఒకసారి ఆవకాయ తయారీ ఫ్యాక్టరీకి వెళ్లి చూడండి.. ఆ తర్వాత మీరు ఎప్పటికీ పచ్చళ్లు తినరంటూ మరో వ్యక్తి రాసుకొచ్చారు. "బయట తిండిపై నమ్మకం పోయింది.. ఇంట్లో వండిన ఆహారమే మిన్న అంటూ పలువురు అభిప్రాయపడ్డారు.

ఇలాంటి ఘటనలు బయటపడటం ఇదే మొదటిసారి కాదు.. ఇదే నెలలో థానేలోని ఒక వీధి వ్యాపారి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేసి.. చేతులు కడుక్కోకుండానే తిరిగి వచ్చి పాప్‌కార్న్ అమ్మడం కనిపించింది. ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీసి ఆన్‌లైన్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement