జుట్టుకు ఉసిరి నూనె

బ్యూటిప్స్
ఎండకాలంలో వేడి, దుమ్ముకు శిరోజాల ఆరోగ్యం, అందం దెబ్బ తింటుంది. వెంట్రుక కుదుళ్లకు సరైన పోషణ లభించి, నిగనిగలను కాపాడుకోవాలంటే...
►కొబ్బరి నూనె – ఉసిరి నూనె సమపాళ్లలో తీసుకొని, మాడుకు పట్టేలా రాసుకోవాలి. వారంలో రెండు సార్లయినా ఈ నూనెను తలకు పట్టించి,. మరుసటి రోజు పొద్దున తలస్నానం చేయాలి.
►పచ్చికొబ్బరిని మెత్తగా రుబ్బి, పాలు పిండి తీయాలి. ఈ పాలను వెంట్రుక కుదుళ్లకు పట్టేలా మాడుకు, జుట్టు మొత్తానికి పట్టించాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈవిధంగా చేస్తుంటే వెంట్రుకల మృదుత్వం దెబ్బతినకుండా ఉంటుంది.
►తేనెలో ఆలివ్ ఆయిల్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారైనా ఈ విధంగా చేస్తే వెంట్రుకల సహజసిద్ధమైన నూనెలు కోల్పోకుండా ఉంటాయి. రసాయనాల గాఢత తగ్గి వెంట్రుకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
►మాడు ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తుంది చుండ్రు. చుండ్రును నియంత్రణలో ఉంచుకోవడానికి ఇంటి చిక్సితలు పాటిస్తూనే చర్మవైద్యులు చెప్పే సూచనలు పాటించాలి.
►పిండి పదార్థాలతో పాటు పీచు ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు.. వంటి పోషకాహారాన్ని సమంగా తీసుకోవాలి.
►వేసవిలో 2–3 లీటర్ల నీళ్లు తాగడం తప్పనిసరి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలటం సమస్య తగ్గుతుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి