డిసెంబర్ 18న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On December 18, the birthday of celebrities | Sakshi
Sakshi News home page

డిసెంబర్ 18న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Dec 17 2015 10:41 PM | Updated on Sep 3 2017 2:09 PM

డిసెంబర్  18న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

డిసెంబర్ 18న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన తేదీ 18. ఇది కుజసంబంధమైనది కాబట్టి జన్మతః

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
రాజ్యలక్ష్మి (నటి), స్నేహా ఉల్లాల్ (హీరోయిన్)

 
ఈ రోజు పుట్టిన తేదీ 18. ఇది కుజసంబంధమైనది కాబట్టి జన్మతః నాయకత్వ లక్షణాలు, దేహదారుఢ్యం కలిగి, పోలీసు, మిలిటరీ రంగాలలో ఉద్యోగాలు సంపాదిస్తారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. పరిశ్రమలు స్థాపిస్తారు. భూ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గత సంవత్సరం ప్రారంభించిన వ్యాపారాలు లాభాల బాటలో పడతాయి. రాజకీయ నాయకులకు పదవులు లభిస్తాయి. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రసంఖ్య కావడం వల్ల వీరు జన్మతః అందాన్ని, మంచి ఊహాశక్తిని కలిగి ఉంటారు. అయితే ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టకుండా, గతంలో చేపట్టిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలనే కొనసాగించడం మంచిది. అలాగే స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది.

తల్లి లేదా భార్య తరఫు వారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కొత్త ఐడియాలు ప్రదర్శించి లాభపడతారు.  లక్కీ డేస్: 1,3,5,6,8, 9; లక్కీ కలర్స్: ఎల్లో, పర్పుల్, వైట్, క్రీమ్, రోజ్, ఆరంజ్, రెడ్; లక్కీ డేస్: సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు. సూచనలు: మాట లు, చేతలలో సంయమనం పాటించడం, దుర్గాదేవిని పూజించడం, తల్లిని, తత్సమానురాలైన వారిని ఆదరించడం, రక్తదానం, శివుడికి అభిషేకం చేయడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు, పదునైన ఆయుధాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త అవసరం.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement