
కావలసినవి
పుచ్చకాయ ముక్కలు – ఒక కప్పు; కమలాపండ్లు – 4; ఆపిల్ – 1 (పెద్దది); నల్ల ద్రాక్ష – రెండు కప్పులు; కివీ పండ్లు – ఒక కప్పు; నిమ్మ చెక్క – అలంకరించడానికి.
తయారీ
♦ కమలాపండ్ల తొక్క తీసి, తొనలను గింజలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
♦ఆపిల్ పండును శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన ఉంచాలి
♦ నల్ల ద్రాక్ష పండ్లను శుభ్రంగా కడగాలి
♦కివీ పండ్లను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి
♦ అన్ని పండ్లను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
♦ అవసరమనుకుంటే కొద్దిగా నీరు జత చేయాలి
♦తయారయిన షర్బత్‌ను గ్లాసులలో పోసి, నిమ్మచెక్కతో అలంకరించి అందించాలి
♦ వేసవి వడ దెబ్బ నుంచి మనలను మనం కాపాడుకోవడానికి ఈ షర్బత్ బాగా పనిచేస్తుంది.