ఇలాగైతే రక్తపు వాంతులూ కావచ్చు! | Gastroenterology counseling | Sakshi
Sakshi News home page

ఇలాగైతే రక్తపు వాంతులూ కావచ్చు!

Jun 23 2015 10:36 PM | Updated on Sep 3 2017 4:15 AM

మీకు సిర్రోసిస్ అనే జబ్బు వల్ల ఆహారవాహికలో ‘ఈసో ఫేజియల్ వారిసెస్’ అనేవి అభివృద్ధి చెందాయి...

గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 65. నేను ఆల్కహాలిక్ సిర్రోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను. నాకు ఎండోస్కోపీ చేసి, నా ఆహారవాహికలో రక్తనాళాలు ఉబ్బి ఉన్నాయి అని చెప్పారు. వీటి వల్ల ఏదైనా ప్రమాదమా?
- అమర్‌నాథరెడ్డి, కర్నూల్

మీకు సిర్రోసిస్ అనే జబ్బు వల్ల ఆహారవాహికలో ‘ఈసో ఫేజియల్ వారిసెస్’ అనేవి అభివృద్ధి చెందాయి. వీటి పరి మాణాన్ని బట్టి మీకు రక్తపు వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ‘వారిసెస్’ ఏ పరిమాణంలో ఉన్నాయ న్న విషయాన్ని రాయలేదు. మామూలుగా వారిసెస్ పరి మాణం గ్రేడ్ 3 లేదా గ్రేడ్ 4 ఉన్నట్లయితే అవి పగిలిపో యేందుకు అవకాశం ఎక్కువ. మీరు రాసినదాన్ని బట్టి మీకు ఇంతకుముందు ఎప్పుడూ రక్తపు వాంతులు కాలేదు కాబట్టి మీరు ప్రొపనాల్ 20 ఎంజీ మాత్రలు రోజుకు రెండుసార్లు వాడితే సరిపోతుంది. ఇక ఎండోస్కోపీ ద్వారా బ్యాండిగ్ అనే చికిత్సతో ఉబ్బిన రక్తనాళాలను పూర్తిగా తగ్గేటట్లు చేయవచ్చు. దీనివల్ల మీకు రక్తపు వాంతులు అయ్యే అవకాశం తగ్గుతుంది. మీరు ఆల్కహాల్‌ను పూర్తిగా మానేయాలి.
 
మా పాప వయసు ఎనిమిదేళ్లు. అప్పుడప్పుడే ఆమె మలంలో రక్తం కనిపిస్తోంది. మామూలుగా మలవిసర్జనలో ఎలాంటి సమస్యా లేదు. నాకు తగిన సలహా ఇవ్వండి.
 - వసుమతి, చిత్తూరు
 
మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీ పాప వయసు రీత్యా పెద్దపేగులో కంతులు (పాలిప్స్) ఉండే అవకాశం ఉంది. దీనివల్ల అప్పుడప్పుడు మలంలో రక్తం పడే అవకాశం ఉంది. తరచూ రక్తం పోవడం వల్ల ఇది అనీమియా (రక్తహీనత)కు దారితీసే అవకాశం ఉంది. మీరు ఒకసారి పాపకు ‘సిగ్మాయిడోస్కోపీ’ అనే పరీక్ష చేయించండి. ఒకవేళ పాప పెద్ద పేగుల్లో ఏవైనా పాలిప్స్ ఉన్నట్లయితే ఎండోస్కోపీ ద్వారా వాటిని తొలగించవచ్చు. దీనివల్ల పాప పూర్తిగా ఉపశమనం పొందే అవకాశం ఉంది.
 నా వయసు 50 ఏళ్లు. మూడేళ్ల క్రితం నా పిత్తాశయాన్ని లాపరోస్కోపిక్ ప్రక్రియ ద్వారా తొలగించారు. ప్రస్తుతం రెణ్లెల్ల నుంచి అదేచోట తరచూ నొప్పి వస్తోంది. తగిన సలహా ఇవ్వండి.
 - సుదర్శన్, నల్గొండ
 
సాధారణంగా కాలేయంలో పుట్టే పైత్యరసం చిన్న చిన్న నాళాల ద్వారా వచ్చి పిత్తాశయంలో కేంద్రీకృతమవు తుంది. పిత్తాశయం నుంచి సీబీడీ అనే గొట్టం ద్వారా చిన్నపేగుల్లోకి చేరుతుంది. పిత్తాశయం తొలగించాక నొప్పి రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ముందు గా స్కానింగ్ ద్వారా సీబీడీ అనే గొట్టంలో ఇంకేమైనా రాళ్లు ఉన్నాయా అని చూపించుకోండి. ఒకవేళ స్కానింగ్ రిపోర్టు నార్మల్‌గా ఉన్నట్లయితే ఒకసారి ఎండోస్కోపీ చేయించు కొని ‘అల్సర్స్’కు సంబంధించిన వ్యాధులేమైనా ఉన్నాయే మో నిర్ధారణ చేయించుకోవాల్సి ఉంటుంది. పైన తెలిపిన కారణాలేమీ లేనట్లయితే భయపడా ల్సిన అవసరం లేదు.
డాక్టర్ భవానీ ప్రసాద్ రాజు
కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement