మైనార్టీలంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపే ఉన్నారని ఆపార్టీ నేత రెహ్మాన్ అన్నారు.
మహబూబ్నగర్ : మైనార్టీలంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపే ఉన్నారని ఆపార్టీ నేత రెహ్మాన్ అన్నారు. మైనార్టీలకు న్యాయం చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని ఆయన బుధవారమిక్కడ గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని రెహ్మాన్ ధీమా వ్యక్తం చేశారు. మైనార్టీ, బీసీ, ఎస్సీలను టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎదగనివ్వలేదని ఆయన విమర్శించారు.