'నిజాయితీ ఓ వైపు.. కుళ్లు, కుతంత్రాలు మరోవైపు' | YS Jagan Mohan Reddy Speech in Mylavaram Road Show | Sakshi
Sakshi News home page

'నిజాయితీ ఓ వైపు.. కుళ్లు, కుతంత్రాలు మరోవైపు'

May 2 2014 9:08 PM | Updated on Aug 14 2018 4:24 PM

'నిజాయితీ ఓ వైపు.. కుళ్లు, కుతంత్రాలు మరోవైపు' - Sakshi

'నిజాయితీ ఓ వైపు.. కుళ్లు, కుతంత్రాలు మరోవైపు'

ఏ నాయకుడైతే పేదవాడి కష్టాలను తెలుసుకుంటాడో ఆ నాయకుడినే మన నేతగా ఎన్నుకుందామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

మైలవరం: ఏ నాయకుడైతే పేదవాడి కష్టాలను తెలుసుకుంటాడో ఆ నాయకుడినే మన నేతగా ఎన్నుకుందామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా మైలవరంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్ షోలో జగన్ ప్రసంగించారు. విశ్వసనీయత, నిజాయతీ ఓ వైపు ఉంటే కుళ్లు, కుతంత్రాలు మరోవైపు ఉన్నాయని అన్నారు.

వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే 5 సంతకాలతో పాటు మరో 6 పనులు చేస్తానని ఆయన హామియిచ్చారు. అమ్మఒడి పథకం అమలుపై తొలి సంతకం చేస్తానని చెప్పారు. అవ్వాతాతల కోసం రెండో సంతకం చేస్తానని వెల్లడించారు. రైతన్నకు భరోసా ఇస్తూ మూడో సంతకం పెడతానని అన్నారు. వ్యవసాయరంగంలో గొప్ప మార్పులు తెస్తానని చెప్పారు.

అక్కా, చెల్లెళ్ల కళ్లల్లో సంతోషం కోసం నాలుగో సంతకం చేస్తానని అన్నారు. ఇల్లు, కార్డులేని నిరుపేదల కోసం 5వ సంతకం పెడతానని హామీయిచ్చారు. ఆరోగ్యశ్రీ పథకంలో మార్పులు తెస్తానని, ఏ గ్రామంలో కూడా బెల్టుషాపు లేకుండా చేస్తానని వైఎస్ జగన్ హామీయిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement