అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రంగనాయకులును పోలీసులు బుధవారం గృహ నిర్బంధం చేశారు.
అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రంగనాయకులును పోలీసులు బుధవారం గృహ నిర్బంధం చేశారు. హిందుపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణతో కలిసి ఆయన పోలింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లారు. దాంతో నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్లోకి ప్రవేశించిన రంగనాయకులును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనిని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు.