ఈవీఎంల భద్రతకు 49 కంపెనీల బలగాలు: డీజీపీ | forces of 49 companies move to evms protection | Sakshi
Sakshi News home page

ఈవీఎంల భద్రతకు 49 కంపెనీల బలగాలు: డీజీపీ

May 10 2014 1:00 AM | Updated on Jul 11 2019 8:26 PM

రాష్ట్రంలో లోక్‌సభ,అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నిలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) భద్రతకు మొత్తం 49 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నట్టు డీజీపీ బి.ప్రసాదరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ,అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నిలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) భద్రతకు  మొత్తం 49 కంపెనీల  కేంద్ర బలగాలను వినియోగిస్తున్నట్టు డీజీపీ బి.ప్రసాదరావు  శుక్రవారం ఒక ప్రకటనలో  తెలిపారు. మున్సిపల్, జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను, తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో పోలీసుసిబ్బంది, అధికారులు సఫలీకృతులయ్యారని డీజీపీ అభినందించారు. ఇక ఓట్లలెక్కింపు కూడా ప్రశాంతంగా  నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకున్నామన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement